గుంటూరు స్వర్ణభారతినగర్ అగ్నిప్రమాద బాధితు లకు జిల్లెళ్ళమూడి శ్రీ విశ్వజనని పరిషత్ 5.10.2006న
గురువారం సాయంత్రం ఉచితంగా దుప్పట్లు, తుండుగుడ్డలు అమ్మ ప్రసాదంగా పంపిణీ చేసారు. ఆ సందర్భంగా జరిగిన సభలో గుంటూరు రూరల్ ఎం.ఆర్.ఓ. శ్రీ గంధం రవీంద్రబాబు, బ్రహ్మాండం రవీంద్రరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ జి.రవీంద్రబాబు ఎమ్.ఆర్.ఒ. మాట్లాడుతూ అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవటం మానవత్వమని పించుకుంటుందని అన్నారు. శ్రీ బి.రవీంద్ర రావు శ్రీ విశ్వజననీపరిషత్ తరఫున మాట్లాడుతూ ఈ కార్యక్రమము గుంటూరు కలెక్టరు జయలక్ష్మి గారి అనుమతితో ఎమ్.ఆర్.ఒ. రవీంద్రబాబు. ఆర్.ఐ. చంద్రారెడ్డి, పోలీసుల సహకారంతో దాదపు 1100 మంది బాధితులకు అత్యంత క్రమశిక్షణతో పంపిణీ జరగటం ఎంతో ఆనందదాయకమని వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమమునకు కాకినాడ నుండి ప్రత్యేకంగా వచ్చిన శ్రీ బి.ఎల్.ఎన్. శాస్త్రి మొదలైన వారు గుంటూరు అధ్యయన పరిషత్ తరఫున శ్రీ జి.వై.ఎన్. బాబు, శ్రీ అన్నంరాజు మురళీకృష్ణ, మాధవి, శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావు మొదలగు వారు. జిల్లెళ్ళమూడి నుండి సర్వ శ్రీ ఎన్. లక్ష్మణరావు, సి. రాజగోపాలరావు, డి.సీతాపతి, కె.బి.జి. కృష్ణమూర్తి, బాబి మొదలగు సోదరులు బాపట్ల నుండి జె. యానాది, ఎల్. రామకోటేశ్వరరావు గార్లు పాల్గొని వారి సేవలను అందించారు. అమ్మకు అత్యంతప్రియమైన ఇటువంటి సేవాకార్యములలో విరివిగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమమునకు ఆర్థిక సహకారము అందించిన సోదరులందరికీ అమ్మ ఆశీస్సులు అంద చేశారు.