అడుగుల సవ్వడి లేక
వడివడిగ నీవడుగిడు నడకల
వేగ మందు కొన జాల
రెవ్వరీ – భువిని ఆదేమి మాయయో!
అది అందరు గల చోటైనను
నీ మృదు మధుర మంజులవాణి
నీవేరికి విన్పింపగా తలతువో
వారికేగాని అన్యుల చెవి చొర
నీయ వదేమి మాయయో!
నీవెంత చెంతనున్నను
నిన్ గూర్చి ఎంత తపించిననూ
“నీవు అన్న తరుణము రానిది
ఏరికీ కన్పింపగా తలపవు అ
దేమి మాయయో!
గాఢనిద్రవోలె గుఱకలు పెట్టుచు
ఆతి నిగూఢముగ భాషించు
సంభాషణల మా కెరుక సేతు
వదేమి మాయయో !
చెట్టు నీడ కొఱకు
చెట్టు దరి చేరి
చెట్టుకొమ్మల నరుకు
మూర్ఖుల – మందలింప వదేమి మాయయో!