ఆశ్చర్యకర అద్వైత తత్త్వం, కేవల శుద్ధ మాతృతత్త్వమే అమ్మ. అమ్మలో మనకు ఏ భేదభావమూ కనిపించదు. “గుణభేదమే లేని నాకు కులభేదమేమిటి?” అంటుంది ఒక సందర్భంలో.
“అంతా అదే నాన్నా!” “ఎంత వెతికినా అది కానిది నాకు కనిపించటం లేదు నాన్నా!” అన్న అమ్మ -వాక్యాలు కేవలం వాక్యాలకే పరిమితం కాదు. అమ్మ జీవితంలో ఎక్కడ వెతికినా కనిపిస్తుంది.
అమ్మ చిన్నతనంలోనే ఒకసారి చిదంబరరావు తాతగారిని అడుగుతుంది. “కృష్ణుడు భగవంతుడే కదా! భగవంతునికి కూడా దుర్మార్గులున్నారా? అన్నీ తనలో నుండే వచ్చినయి గదా!” అని ప్రశ్నిస్తుంది.
అలాగే మరో సందర్భంలో చిదంబరరావు తాతగారు దీపావళి ప్రాముఖ్యతను గురించి చెప్తూ అది ఒక పోయిన దినమనీ, అందరికీ || ఆనందప్రదమయిన స్మృతిచిహ్నమయిన దినమనీ” వివరిస్తారు.
అమ్మ అంటుంది “అటువంటి ఆనందం నాకు లేదు. ఒక బిడ్డ తరిగాడని బాధకూడా లేదు లెండి. కృష్ణుడిని చూస్తే సంతోషమూ లేదు. నరకాసురుడు చస్తే బాధాలేదు.” అంటూ “నాకు ఎప్పుడూ ఏమీ అనిపించదు. ఏ సంఘటనా నాకు సంఖాన్ని గానీ, దుఃఖాన్ని గానీ యివ్వవు. అంతా, అన్నీ నేనేననిపిస్తుంది. నేనంటే ఈ అనసూయమ్మనే అని కాదు. అందరిలో వున్న నేను” అని తన స్వస్వరూపాన్నీ, నిజస్వభావాన్నీ, తత్త్వాన్ని విడమరచి చెప్తుంది.
సుఖ దుఃఖాలు, భేద మోదాలు మొదలైన ద్వంద్వాలు అమ్మలో కనిపించవు. జీవితంలో ఏది ఎదురైతే దానిని స్వీకరించమని చెప్పటమే కాదు, తను ఆచరించి చూపించింది. ‘ప్రజ్ఞానం బ్రహ్మైతే అజ్ఞానం బ్రహ్మెందుకు కాదని” అడిగింది. “సుగంధాలన్నీ నీ కోసమమ్మా” అంటే, “మరి దుర్గంధమో?” అని ప్రశ్నించింది. అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే అశుద్ధమూ అదేననటమూ అమ్మకే చెల్లింది.
“ఏకమేవా ద్వితీయం బ్రహ్మ” అని | సర్వ తానయిన స్థితి, స్వరూప స్వభావాలను అమ్మ పై వాక్యాలతో స్పష్టంగా వివరించ టమే గాక, ఆచరణలో అడుగడుగునా చూపిస్తుంది.
ఇంతటి మహోన్నత అద్వైత తత్త్వమూర్తి సంచరించిన కాలంలో మనం జీవించటం మన అదృష్టం.
అమ్మ జీవిత మహోదధిలోని ఆ ఆణిముత్యాలను, మణిరత్నాలని అందుకున్న అందరూ ధన్యులే!!
జయహోమాతా!