అమ్మే మధురం నాన్నే మధురం
అమ్మానాన్నల ప్రేమే మధురం
పురమే మధురం కోవెల మధురం
అర్కపురములో అంతా మధురం
అన్నం మధురం తీర్థం మధురం
అన్నామృతమే ఎంతో మధురం
నామం మధురం గానం మధురం
నామ సంకీర్తనే అమ్మకు మధురం
పఠనం మధురం శ్రవణం మధురం
అమ్మను తెలిపే చరితం మధురం
భావం మధురం కవనం మధురం
ప్రతి అక్షరమూ ఎంతో మధురం
హైమే మధురం కరుణే మధురం
కరుణామృతమౌ దేవియె మధురం
ధ్యాసే మధురం ధ్యానం మధురం
శ్వాసే అమ్మగ మనుటే మధురం