పల్లవి
అనసూయేశ్వర నమో నమో
శ్రీ నాగేశ్వర నమో నమో
అర్కపురీశ్వర నమో నమో
బ్రహ్మాండేశ్వర నమో నమో
చరణం
మృత్యుంజయ హర నమో నమో
భుక్తి ప్రదాత నమో నమో
స్వయం ప్రకాశ నమో నమో
సద్గుణ భూషిత నమో నమో
చరణం
విశ్వవందిత నమో నమో
విబుధసేవిత నమో నమో
అర్ధనారీశ్వర నమో నమో
అభయప్రదాత నమో నమో
చరణం
మంగళరూప నమో నమో
మౌనస్వరూప నమో నమో
సర్వమంగళారాధ్య నమో నమో
సర్వాధారాధార నమో నమో