జయ జయా ! అనసూయ జననీ !
సహన సౌజన్య సమభావ ధరణీ !
॥ జయ ॥
నీ పాద సంసేవనమ్ము !
దివ్యదేశాల సందర్శనమ్ము
నీ నామ సంకీర్తనమ్ము
సర్వ పాపాల ప్రక్షాళనమ్ము
॥ జయ ॥
నీ దృష్టి ప్రస్తారణమ్ము
విశ్వకళ్యాణ సంధాయకమ్ము
నీ కీర్తి విస్తారణమ్ము
దిగ్దిగంతాల కారాధనమ్ము
॥ జయ ॥
నీ మాతృ వాత్సల్య గుణము
మా పుణ్య పరిపాక ఫలము
నీ దివ్య స్పర్శానుభవము
కోటి హేమంతముల చల్లదనము
॥ జయ ॥
నీ అండనే యుంటి మమ్మా !
కైదండ నిడి బ్రోవు మమ్మా !
అమ్మా ! అమ్మా ! అమ్మలకు
అమ్మ అనసూయదేవ్యై నమో నమః !
జయ జయా ! అనసూయ జననీ!
సహన సౌజన్య సమభావ ధరణీ !