ఆలపించనా అమ్మా! – ఆలపించనా
అమృతమౌ నీ నామం- ఆలపించనా
ఆలకించనా అమ్మా!
ఆలకించనా
అద్భుతమౌ నీ చరితం ఆలకించనా!!
నీ దయాసాగరం అనంతం అఖండం
నీ మాతృ వాత్సల్యం
ఈ సృష్టికి ఆధారం
హ్రీంకారసన! నీకు
మా మనసే మందిరం
ఆనంద జ్యోతికిదే అనురాగ కైంకర్యం!!
వరదాయిని! పరమేశ్వరి!!
వందనాలు నీకమ్మా
శ్రీ అర్కపురవాసిని!
మా పూజలు గైకొనుమా
భుక్తి ముక్తి ప్రదాయిని
భూమాతవు నీవమ్మా
విజ్ఞాన ఖని నీవు
విశ్వ జనని మాయమ్మా!!