జగమేలు తల్లికీ కోయిలా
జేజేలు పలుకవే కోయిలా
ఏ పూర్వజన్మలో ఏ పుణ్యమో చేసి
జిల్లెళ్ళమూడిలో అమ్మ ఒడి చేరావు
ప్రేమానురాగాలు అమ్మకాభరణాలు
నీకేమి కొదవంక కోయిలా
గొంతెత్తి పాడవే కోయిలా
||జగమేలు||
అందరింటను వెలసి అన్నపూర్ణగ నిలచి
ఆకలీ ఆకలని ఆర్తితో పిలవంగ
కేక విన్నంతనే ఆకలి తీర్చేటి
అమ్మ నామము చేయి కోయిలా….
జన్మసార్థకమౌను కోయిలా
||జగమేలు||
కరుణామృతము గ్రోల చరణాలపై వ్రాలు
శరణార్థులౌ జనుల కరుణాల తల్లియై
కలిలోన వెలసింది ఇల వేలుపయ్యింది.
జాగేల రావేల కోయిలా…..
రాగాలు మ్రోగాలి కోయిలా…..
||జగమేలు||