అనురాగ క్షీరాబ్ది అమ్మ హృదయమ్మే
అన్నపూర్ణాలయం దాని రూపమ్మే అమ్మరూపమ్మే ॥
మధురాతి మధురమౌ మమతనే కూర్చి
కారుణ్య వాత్సల్య రుచులనే చేర్చి
అమృతపు – ఔషధపు ముద్దలను పంచి
అష్టసిద్దుల నిచ్చు అన్నపూర్ణాలయం ॥
సర్వసమదృష్టితో అనుభవపు పుష్టితో
లౌకికము దైవికము రెండు ఒకటే ననుచు
తరతమమ్ములు లేక – కులమతమ్ములు లేక
ఆకలే అర్హతను అన్నపూర్ణాలయం ॥
సర్వస్వతంత్రమౌ సత్రమిదియే అంచు
అందరూ బిడ్డలే అందరిల్లనిపించు
ఆదరణ ఆప్యాయతల నోటి కందించు
అపురూప ఆలయం అన్నపూర్ణాలయం ॥