1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అన్నపూర్ణేశ్వరి అమ్మకి అన్నాభిషేకం

అన్నపూర్ణేశ్వరి అమ్మకి అన్నాభిషేకం

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : July
Issue Number : 12
Year : 2012

జాతికులమత వర్ణ వర్గ విభేదం లేక దేశవిదేశాల్లో అసంఖ్యాక సోదరీసోదరులు మాతృశ్రీ అనసూయాదేవి, జిల్లెళ్ళమూడి అమ్మను “అమ్మ” అని మనసారా సమ్మానిస్తారు. ఆపద్బాంధవిగా, అర్చామూర్తిగా తమ మనో మందిరాల్లో ఆరాధిస్తారు. అమ్మ జన్మదినం 28. 3. 1923. అవతార పరిసమాప్తి 12.6.1985.

అమ్మ ఎందువలన సకల జనారాధ్య అయింది? భర్త – ముగ్గురు బిడ్డల తల్లిగా అమ్మ ఒక సామాన్య గృహిణిలా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అమ్మ విశ్వకుటుంబిని. అమ్మ అంటుంది, “మిమ్మల్నందరినీ నేనే కన్నాను. మీ తల్లులకు పెంపుడిచ్చాను” అని. అమ్మ అసలైన అమ్మ, సర్వత్రా పరివ్యాప్తమైన ఈ మాతృత్వమమకార విశేషమే అమ్మను సకల జనారాధ్యను చేసింది.

కళ్ళకి కట్టినట్లు ప్రస్ఫుటంగా అందరికీ అమ్మలో కనిపించే విశేషం ఒకటి ఉంది. అమ్మ నిరాహార; ఆహారం తీసుకోదు. నిజం. కానీ ఆకలితో ఎవరైనా ఉంటే ఆబాధని భరించలేదు. ॥ నుంచీ అమ్మ తన కడుపు నింపు బాల్య కోకుండా తనకు పెట్టిన అన్నాన్ని, వంటి మీది బంగారాన్ని రోగులకు, యాచకులకు, బాధితులకు ప్రేమగా ఇచ్చి ఆదుకున్నది. వివాహం అయిన తర్వాత తానే స్వయంగా వండి ఆప్యాయంగా అన్నం వడ్డించేది. మాతృత్వ మమకార మాధుర్యాన్ని రంగరించి గోరుముద్దలు చేసి స్వయంగా తినిపించేది. లౌకికమూ పారమార్థికమూ అనే భేదం లేకుండా జ్ఞానామృతాన్ని ఉగ్గుపాలతో పోసింది.

15.8.1958లో అమ్మ స్వహస్తాలతో అన్నపూర్ణా లయాన్ని స్థాపించింది. వందల వేల సంఖ్యలో వచ్చే తన బిడ్డలకు అన్నం పెట్టుకోవటం కోసం అది అమ్మ ఒక ఏర్పాటు. నాటి నుంచి లక్షలాదిమందికి అన్నపూర్ణేశ్వరి అమ్మ అన్నం పెట్టింది. కేవలం మనుష్యులే కాదు అమ్మ బిడ్డలు – జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులూను. అది అమ్మ తన కర్తవ్యంగా భావించింది; తత్త్వతః అది అమ్మ కడుపుతీపి. అందువలన అమ్మ కోరికల ఇలా ఉంటాయి.

1) లక్షమంది బిడ్డలు బారులు తీరి సహపంక్తి భోజనం చేస్తుంటే చూసి ఆనందించాలి.

2) అన్నపూర్ణాలయంలో జనసందోహం కోసం గుంతో అన్నం వండి వార్చి పెద్ద స్టీల్ ట్రేలో చల్లార్చేవారు. తాను శరీరత్యాగం చేసిన పిమ్మట బిడ్డల కడసారి దర్శనార్థం తన శరీరాన్ని ఆ స్టీల్ పళ్ళెంలో ఉంచమని కోరింది. వాత్సల్యామృతవర్షిణి అమ్మ కోరికలు అలా ఉంటాయి.

అమ్మ చేతి పట్టెడన్నం కేవలం ఆకలిని రూపుమాపే ఒక పదార్థం మాత్రమే కాదు. అది ఆధివ్యాధులకు ఒక దివ్యౌషధం, అమ్మ అనుగ్రహానికి అనిర్వచనీయమైన శక్తి ప్రసారానికి ఒక మాధ్యమం అని పలువురి అనుభవం, విశ్వాసం. పూజ్య శ్రీ కందుకూరి శివానందమూర్తిగారు, “అమ్మ పెట్టిన అన్నం ముద్దలో ఎన్ని మెతుకులు ఉంటాయో అవి అన్ని జన్మల కర్మఫలాల్ని నశింపజేస్తాయి” అని వివరించారు.

మరొక కోణం లోంచి చూస్తే – జీవులలో ఆకలి. అనేది వైశ్వానరాగ్ని రూపంగా వెలుగొందే దైవమే. కనుకనే అమ్మ అంటుంది, “నేనేమి వేసినా అన్నపూర్ణాలయం గాడిపొయ్యిలో వేస్తాను” అని. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం యజ్ఞకుండంలో అర్పించిన హోమద్రవ్యమే, దేవతలకు అర్పించిన హవిర్భాగమే. అన్నపూర్ణాలయం వేదవిహిత నిత్యాగ్ని హోత్ర క్రతువు నిర్వహించబడే యాగశాల, అమ్మ ప్రేమ ప్రయోగశాల. ‘అడగనిదే అమ్మ ‘అయినా పెట్టదు’ అనే అర్థరహిత నానుడిని అమ్మ సరిచేసింది; “అడగపోయినా అవసరాన్ని గమనించి పెట్టేదే అమ్మ” అని సరికొత్త సంపూర్ణ నిర్వచనాన్ని వెలయించింది. అక్కడ జరిగేది ‘అన్నదానం’ అని అంటే అమ్మ నొచ్చుకుంటుంది. “నా బిడ్డలకు అన్నం పెట్టుకున్నాను. ఇది దానం ఎట్లా అవుతుంది ?’ అని నిలదీస్తుంది; బాధపడుతుంది.

అన్నపెట్టుకోవటం అంటే అమ్మకి ఎందుకు అంత ఇష్టం ? శరీరధారణకి అన్నం అత్యంత ఆవశ్యకం. శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశాలకి అన్నమయ కోశమే ప్రధాన భూమిక – అని మనం అంటాం. “అన్ని బాధల దివ్య సందేశం; కంటే ఆకలి బాధ గొప్పది” అంటుంది అమ్మ హృదయం. ఒకసారి చిలకలూరిపేట నుండి ఒక జ్యోతిష్కులు అమ్మ దర్శనార్థం వచ్చారు. అమ్మ ఏదైనా ప్రశ్న వేస్తే తాము గణితం వేసి సమాధానమిస్తామని విన్నవించుకున్నారు.

“ప్రపంచంలో అందరూ కడుపునిండా తినాలి. ఎవరూ ఎప్పుడూ ఆకలిబాధకి గురికారాదు. ఈ తరుణం ఎప్పుడు? అది సాధ్యమేనా?” అనే అమ్మ ప్రశ్నకి వారు ఆశ్చర్య చకితులయ్యారు. అది అమ్మ నిరంతర తపన, ఒక ఆశ, ఒక అసంతృప్తి, విశ్వజనీన మాతృప్రేమ మహిమ గరిమలను చాటుతుంది. అందరి బాధలు తన బాధేనని, వాళ్ళని ఉద్ధరించాలని విలవిలలాడే ఆ అలౌకిక లక్షణమే అమ్మను జగదారాధ్యగా చేశాయి.

బిడ్డలకి కదుపునిందా అన్నం, కట్టుకోను గుడ్డలు పెట్టుకోవాలని అమ్మ ఆకాంక్ష ఒకసారి ఏలూరు సోదరులు శ్రీ టి.టి.అప్పారావుగార్కి అమ్మ స్వయంగా భోజనం పెడుతున్నది. కారానికి బదులుగా మాతృత్వ మమకారాన్ని

కలిపి నోటికి అన్నం ముద్బలు అందిస్తున్నది. అమృతోపమానమైన అమ్మ చేతి మహాప్రసాదం తింటూ, “అమ్మా! నువ్వు పెడుతూంటే ఎంత హాయిగా ఉన్నది” అన్నారాయన. వెంటనే అమ్మ “తినేవారికి ఇంత హాయిగా ఉంటే పెట్టేవారికి ఎంత హాయిగా ఉంటుందో!” అంటూ నిగమాగమసారాన్ని వడ్డించింది. అమ్మ అనుగ్రహించిన

“నీ కిచ్చింది తృప్తిగా తిని, నలుగురికి ఆదరణగా పెట్టుకో, అంతా వాడే (దైవం) చేస్తున్నాడని నమ్ము. ” త్యాగం వలన అమృతత్వం సిద్ధిస్తుంది అనే వేదవాక్కుకి దర్పణం పడుతుంది.

సాధారణంగా ఈశ్వరాలయాల్లో నమకచమకాలతో పంచామృతాలతో రుద్రాభిషేకం చేస్తారు.

కానీ జిల్లెళ్ళమూడిలో అమ్మ అవతార పరిసమాప్తి చేసిన రోజు, జూన్ 12వ తేదీన శ్రీ అనసూయేశ్వ రాలయంలో అనంతోత్సవం పేరిట అన్నపూర్ణేశ్వరి అమ్మకి క్షీరధారలతో, అన్నంతో అభిషేకం చేస్తారు. నాడు ఈ ఉన్నాన్నే ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది అపూర్వము, విశిష్టము, విశేషము, విశేష ఫలదాయకము.

-అమ్మ శ్రీచరణ సన్నిధిలో నిర్వహింపబడే నిరతాన్న ప్రసాదవితరణ వివరాలకోసం సంప్రదించండి.

శ్రీవిశ్వజననీపరిషత్, జిల్లెళ్ళమూడి-522113; 

ఫోన్ : 08643-227324, 227492

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!