అనసూయా మాతా నను
కనిపెట్టుచునుండు మమ్మ కడదాకను నా
కనిపెంచిన యమ్మవలెను
వినిపించెద నా మొర మరి వీక్షణ జేయన్!
అన్నిట నిన్నే గాంచగ
కన్నులు మరి యుండె నాకు కడదాకను – నా
అన్నువయిన జన్మంబది
మన్నున మసిగాక మునుపె మనవిని వినుమా!
మన్నవ వారాడబడుచు
ఎన్నడు వీడని ముసిముసి యెల్నవ్వులతో
వెన్ను నిమిరి దీవించెడి
సున్నిత మనసునుగల ననసూయయె నామెన్ !
అన్నము పెట్టిన తల్లికి
విన్నపమిడెదనుగ నే సవినయము తోడన్
సన్నుతి జేసెద నిను నే
నున్నానని బ్రోవుమమ్మ నొల్లమి లేకన్!
జిల్లెళ్లమూడి వాసిని
యెల్లరులను కాచుచుండు నెచ్చోటయినన్
పిల్లాపాపల వలెనిక
చల్లగ చూడుమ కొలిచెడి జనులను తల్లీ!