1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అన్వేషణమ్

అన్వేషణమ్

Chandra Mouli Chidambara Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : August
Issue Number : 1
Year : 2011

గోపులతోడ నవ్వనికి గోపకిశోరము వాసుదేవు డా

 దాపున వచ్చుచుండునని తద్దయునెంచి, ప్రమోదమంది, యు

 ద్దీపితమానసుండనయి, తేజమొసంగిన భంగి దోపఁనే 

నా పరమేశురాకకు మహాతురతంగని యిట్టు లెంచితిన్

 

పాపము పాపపుణ్యముల పాటు లెరుంగని ముగ్ధగోపికా

 గోపుల సాధుగోతతుల, కోర్కెలు దీర్చుచు ముక్తి సౌధముల్ 

కాపురపిండ్లుగా సలుపగాఁగల కృష్ణరమేశు డర్మిలిన్ 

చేపడుగాక నాకు నిజ చిన్మయ రూపవిలాసలీలతోన్

 

అనితలపోయుచు వెదకుచు, కనులకు పొడగట్టినట్లు గాంచుచు నగుచున్

 కనుపడమికి మదివిసుగుచు కనుగొన పంతంబుదోపగా నిటులంటిన్ 

వనదీపములంగైకొని వనమాల ఘటించి హృదయవనజము చెలగన్

 వనమాలి మేలిగళమున వనరాణిరవంబు చెలగవైచుట ఎపుడో

 

కాంచెద చూడు నిన్నిపుడె, కాంచనచేల, మురారి, నన్ను వం

 చింది, ఎందు డాగితివొ, చెప్పుము చప్పున నిన్నుఁ జూడఁ గాం

 క్షించెడు నన్ను, దాసునిటు చెట్టుల గుట్టులఁ ద్రిప్పవచ్చునే 

వంచనసేయకయ్య యని ప్రార్థన చేసితినందనందనున్

 

పలుమారు న్మది ధైర్యమూనుచు, మనోవాంచాఫలప్రాప్తి యే

 వలన న్గల్గునొయంచుఁ బెక్కుగతుల న్యావించి తర్కించుచున్

 జలజాక్షుం గనలేమికి న్విసివి, యాశాభంగమైనట్లుగాఁ 

దలపంజొచ్చునుఁగాన ద్రిమ్మరితి నే తధ్యానమగ్నుండనై

 

తిరిగినచోటులు మరలం దిరుగుచు నందెందు కృష్ణునింగానక న 

పరమానుభావుడగు నీశ్వరు డెందున్నాడొయనుచు నిట్లు దలచితిన్.

 

పరమధ్యానపరాయణానుభవ దీప్యంబై సదామౌని హృ 

త్సరసీజాతమరందపానరతమై తత్సౌధ సీమాంతర

 స్థిరవాస ప్రకటీ కృతాత్మ విభవోత్సేక క్రియాలోభమౌ 

పరమాత్మార్థము గాంచగాగలుగు సౌభాగ్యంబు నే నందెదన్

 

రాడాబృందకు నేడు మున్పటివలెన్ రాజీవనేంత్రుండు తా

 లేడో పట్టణమందు నీదినమునన్ లీలామనుష్యాకృతిన్ 

తోడై భక్తుల దుఃఖముల్గెడపి చేతో మోదముం గూర్చు వా

 డేడీ, యేటికి రాడొ, నాదురితమే యీలాగు సేయించాం.

 

కన్నులఁ బొడగానఁగారానివాని నీ కన్నులఁజూచు టేకరణిఁగలుగు

 గతరాత్మకుండగు భగవాను నేనీ కంటఁ గనుభాగ్యమేది నాకు

 సకలలోకైకనాకు దర్శనం బెట్లు వికలమానస జడాత్మకున కగును

 అఖిల కల్యాణ గుణాకరుండగు నీశు సేవ యేగతి పాపజీవి కబ్బు

 

ననుచుఁబలుమారు సంశయంబున నొకింత

 దైన్యమందుచు కుందుచు ధైర్యమూని

 ముందునడచుచు వెదకుచు మోదభేద

 పరవశంబునఁగానలోఁదిరిగి నాడ

 

దినమెల్లగడచిపోయెను, వనజేక్షణుఁ జూడనైతి వ్యర్థుడనైతిన్ 

వనజాప్తుడెల్లి గ్రమ్మరఁగనుపించెడువేళ వత్తుఁగాక యటంచున్

 

 సంజకెంజాయలు సరసంబుగా నీలినీడలతో ముద్దులాడువేళ 

నలినంబు లోకబాంధవు చేతిగిలిగింత మురిసి విసిగి మూతి ముడుచువేళ

 గూటకందువులకు నోటనోగిరమిడ ఁబక్షు లిక్కలఁజేరఁబారువేళ

 పిల్లలు వీధుల నల్లారుముద్దుగాఁ గూడి రంతులనాటలాడువేళ

 

 చుక్కకన్నియ లిల తొంగి చూచువేళ

 నిరులు డిగఁ బైట వడి సవరించువేళ 

గోవు నంబా యనుచు దూడగూడువేళ

 చిత్తమున చింతతోనిల్లు చేరదలచి.

 

మనమున దుఃఖభారమున మందగతింగొని యింటికెట్టులో

 జని, ఫలసిద్ధిగా విచారమునొందుచు రేవుదూరుచున్ 

మునుపటి రీతి నిద్దురను బోవక జాగరణంబుతోడఁగూ

 ర్కిన గలలెన్నియో గలిగి రేయిఎటో గడచెన్ యుగంబుగాన్,

 

 ఆకు జొంపములలో నల్లిబిల్లిగ నల్లుకొన్న తీవెలఁగృష్ణుడున్నయట్లు

 యమునానదితరంగములలో నీదుచు మునుగుచు లేచుచుబోవునట్లు

 గోపకాంతల చీరకొంగులఁగెంగేల బట్టివీడుచు గేలిగొట్టినట్లు

 భువనమోహన లీల మురళిమోవిన్మోపి భావగీతంబులు బాడినట్లు 

 

నన్నుగని నందసూతుడు నయనయుగము

 విచ్చి నా దగ్గరకు వచ్చి వేడ్కతోడ 

పలుకరించిన బదముల భక్తివ్రాలి.

 వందనము జేసినట్లు స్వప్నములఁగంటి..

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!