1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అభయప్రదాయిని

అభయప్రదాయిని

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : February
Issue Number : 7
Year : 2012

బూదరాజు దుర్గాప్రసాదరావు రామకృష్ణ అన్నయ్య రెండవ మేనల్లుడు. పెద్ద అక్కయ్య వసుమతి గారి రెండవ సంతానం దుర్గాప్రసాద్ వినయానికి నిలువెత్తు రూపం. ఎన్.యఫ్.సి. హైద్రాబాద్లో ఉద్యోగవిరమణ చేశాడు. తన చిన్ననాటి అనుభవాన్ని ఇలా వివరించాడు.

చిన్ననాటి నుండి దుర్గాప్రసాద్ జిల్లెళ్ళమూడి వస్తూ పోతూ ఉండేవాడు. మామయ్య రామకృష్ణ అన్నయ్య జిల్లెళ్ళమూడిలో ఉన్నాడు కనుక తను వస్తూ ఉండేవాడే కాని పెద్దగా ‘అమ్మ’ మీద నమ్మకం లేదు. అమ్మ మానవతావాదం మీద గురి ఉందిగాని అమ్మే దేవత అన్న విషయం మీద విశ్వాసం లేదు. దేవత అంటే నాలుగు చేతులు, శిరస్సున కిరీటం, చేతిలో త్రిశూలం ఉండాలని భావన.

అలాంటి దుర్గాప్రసాదు అమ్మ దగ్గర ఉపనయనం జరిగింది. అమ్మ మంత్రోపదేశం చేసింది. గాయత్రి మాత అవతారం అమ్మ చేతే ఉపదేశం పొందిన భాగ్యశాలి దుర్గాప్రసాద్. రామకృష్ణ బంధువర్గం మొత్తాన్ని ‘అమ్మ’ అనుగ్రహించింది అనటానికి ఇదీ ఒక ఉదాహరణ.

దుర్గాప్రసాద్ ఉపనయనం పూర్తి అయింది. మరుసటి రోజు తిరిగి హైద్రాబాద్ వెళ్ళాలని అమ్మని దర్శించుకొన్నాడు. ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య కుంకుమ పొట్లాలు ప్రసాదంగా ఇచ్చాడు. అమ్మ దుర్గాప్రసాద్ “దుర్గా మంత్రం గుర్తున్నదా?” రోజూ మంత్రం జపించుకో” అని అన్నది. గుర్తున్నది అని దుర్గాప్రసాద్ తలూపాడు. అమ్మ పదే పదే ఇదే ప్రశ్నవేసింది. దుర్గాప్రసాద్ అన్నిసార్లు తలూపాడు.

దుర్గాప్రసాద్ అమ్మ మరోమాట చెప్పింది. “నాన్నా! దుర్గా ! దేవత అంటే నాలుగు చేతులు తలపై కిరీటం ఉండాల్సిన అవసరం లేదు. మనుషులలోనే దేవతలున్నారు నాన్నా ! వారిని గుర్తించు” దుర్గాప్రసాద్ మనస్సులోని సందేహాన్ని దుర్గాప్రసాద్ బయటకు చెప్పకుండానే పటాపంచలు చేసింది. ఇది ఒక్క దుర్గాప్రసాద్  కే కాదు సమస్త మానవాళికి అమ్మ ఇచ్చిన సందేశం “నాన్నా! దుర్గా ! మామయ్య కుంకం పొట్లాలు ఇచ్చాడు కదా ! నీకు కడుపులో నొప్పు వస్తే మంచి నీళ్ళల్లో ఈ కుంకుమ కలుపుకొని తాగు. నొప్పి తగ్గుతుంది” అని దుర్గాప్రసాద్కు అమ్మ “అభయం” ఇచ్చింది. దుర్గాప్రసాద్కు ఎలాంటి నొప్పి లేకపోవటంతో నవ్వుకొని సరేనమ్మా! అన్నాడు. అమ్మ దగ్గర, రామకృష్ణ అన్నయ్య దగ్గర శెలవు తీసికొని హైద్రాబాద్ చేరాడు.

తెల్లవారి ఆఫీసుకు వెళ్ళటానికి సిద్ధమైనాడు. అంతే. విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. తట్టుకోలేనంత నొప్పి, మంచినీళ్ళు తాగుదామని బ్యాగ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసికొన్నాడు. ప్రక్కనే కుంకం పొట్లాలు కనిపించినాయి. వెంటనే ‘అమ్మ’ ఇచ్చిన అభయం గుర్తుకు వచ్చింది. కుంకుమ కలిపిన మంచినీళ్ళు తాగాడు. అంతే నొప్పి తగ్గిపోయింది. తనకిలా నొప్పివస్తుందని అమ్మ కెలా తెలుసు? అమ్మ దేవతా? దానికి అమ్మే సమాధానం చెప్పింది మనుషులలోనే దేవతలుంటారని. అతని అనుమానాలన్నీ ఆక్షణం నుండి పటాపంచలైనాయి. ఆక్షణం నుండి అమ్మే దేవతగా ఆరాధించాడు. తర్వాత అతని వివాహం కూడా ‘సుబ్బలక్ష్మి’ తో అమ్మే తన సమక్షంలో ఘనంగా జరిపించింది.

మరునాడు దుర్గాప్రసాద్ తల్లి వసుమతిగారు దుర్గాప్రసాద్ని అడిగారట “మంత్రం జపిస్తున్నావా?” అని. నిజానికి ఆ మంత్రం వాయిద్యాల హోరులో కెక్కలేదు. అందుకే అమ్మ పదే పదే మంత్రం గుర్తుందా! దుర్గ చెవి అని ప్రశ్నించింది అమ్మ సర్వజ్ఞతను మరోమారు స్మరించుకుంటూ తల్లికి విషయం చెప్పాడు. వసుమతమ్మగారు సలహా ఇచ్చింది” కనీసం మామయ్యను అడిగి కనుక్కోమని. దుర్గాప్రసాద్ రామకృష్ణ అన్నయ్యను అడిగి మంత్రం తెలుసుకున్నాడు. అప్పటి నుండి జీవితంలో ప్రతి మలుపులో అమ్మ అనుగ్రహం పొందుతూ ‘అమ్మ’ చెప్పిన ఆ మనుషులలో దేవత ‘అమ్మే’ అని ప్రగాఢంగా విశ్వసిస్తూ జీవిస్తున్నాడు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!