నీ అందం చూడాలి- ఆనందం పొందాలి
అణువణువూ ఆక్రమించిన అమ్మతనంతో కలియాలి
ఓ త్రిపురసుందరీ….ఓ అమృతమాధురీ….
||ఓ త్రిపురసుందరీ॥
ఎప్పటి నుండో ఉన్నావట
పుట్టుక అంటూ లేనేలేదట
ఎప్పుడూ నీవుంటావట
అంతా నీ ఆధీనమట
||ఓ త్రిపురసుందరీ॥
అక్కడ ఇక్కడ నీవేనట
నామ రూపములు లేనేలేవట
అన్నిటినీ నువు చూస్తావట
సృష్టి స్థితిలయలు నీవేనట
||ఓ త్రిపురసుందరీ॥
నే పరిమితమైన రూపాన్ని
చైతన్యము నెరుగని జీవాన్ని
చూపించుము నాపై నీ కరుణ
దీపించును ఆత్మే ఆపైన
||ఓ త్రిపురసుందరీ॥