ఒకసారి నేను అమ్మ గదిలో కూర్చొని ఉండగా ఎవరో ఒకాయన (నాకు పరిచయం లేని వ్యక్తి) అమ్మ దగ్గరకు వచ్చి, పాదాలకు నమస్కరించి “అమ్మా, నేను ఇంక నేను వెళతాను” అని అమ్మ పెట్టే బొట్టుకోసం ఎదురు చూస్తున్నాడు. అమ్మ “రెండు రోజులుండి వెళుదువుగానిలే నాన్నా” అన్నది. అయినా ఆయన “లేదమ్మా నేను వెళ్ళాలి” అంటూ చిన్నగా నసిగాడు. “ఎక్కడకి నాన్నా?” అని అడిగింది అమ్మ. తిరుపతి వెళ్ళాలమ్మా. వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని తలనీలాలు మొక్కు తీర్చాలి. “ఫరవాలేదు ఉండు” అని అమ్మ అన్నప్పటికీ ఆయన నీకు తెలుసు కదమ్మా మొక్కు – శ్రీ
అని అన్నాడు. అమ్మ చిరునవ్వుతో, ఒక అరచేయి చాపుతూ ఎవరో దూరంగా ఉన్న వాడిని ఉద్దేశించి అంటునట్లు “వాడికి (వెంకటేశ్వరస్వామికి) నేను చెప్తాలేరా. నువ్వు ఉండు. ఆ ఇచ్చేదేదో (తలనీలాలు మొక్కు) నాకిచ్చేయ్” అన్నది. అలా అంటున్నప్పుడు అమ్మ కళ్ళలో తన కన్న బిడ్డ మీద ఉండేలాంటి వాత్సల్యం, మాటలలో మార్దవం చెప్పలేం. కళ్ళారా చూడాల్సిందే, వీనులారా వినాల్సిందే!! అమ్మకి దేవుళ్ళూ బిడ్డలే మరి!!
ఆయన అమ్మ ఆదేశాన్ని శిరసావహించి తన ప్రయాణం మానుకొని అమ్మకే మొక్కు తీర్చుకొన్నాడు.
తన సన్నిధిలో వుంచుకోవటం కోసం అమ్మ చేత అంతగా బ్రతిమాలించుకొన్న ఆ సోదరుడు ఎంత తీర్చకపోతే ఆయన ఊరుకోడు. ముక్కు పట్టుకొంటాడు అదృష్టవంతుడో?
జయహో మాతా!!