డా|| B.L.సుగుణ: ‘నేను గురువును కాను, మీరు శిష్యులు కారు, నేను దైవాన్నికాను, మీరు భక్తులు కాదు’ అని ప్రవచించింది అమ్మ. మాత అంటే సమస్తాన్ని తనలో ఇముడ్చుకున్నది అని అర్ధం. కనుక అమ్మ ప్రత్యేకించి గురువునని కాని, దైవాన్నని కాని చెప్పవలసిన అవసరం లేదు. తల్లిగా కనిపించే గురువు అమ్మ. ఉద్యోగాన్ని నీతీ నిజాయితీతో నిర్వహించమని, స్వధర్మాచరణే కర్తవ్యం అని, ఆ కర్తవ్యమే దైవమని సుబోధకం చేసిన అమ్మ గురుమండలరూపిణి’ అంటూ నాటి ప్రధానవక్త ఆధ్యాత్మిక శాస్త్రవేత శ్రీ V.S.R.మూర్తి గార్కి, ఆసక్తితో పాల్గొంటున్న ఆత్మీయులందరికీ స్వాగతాంజలి ఘటించారు.
శ్రీ రావూరి ప్రసాద్: ‘యయా శక్త్యా బ్రహ్మా’ శ్లోకాన్ని ఆర్తితో గానం చేసి త్రిశక్తిరూపిణిగా అమ్మను దర్శింపజేశారు. ‘నీకు నీవేను సాటి’ అనే రాజు బావ పాటను రాగయుక్తంగా భావయుక్తంగా సందర్భోచితంగా గానం చేశారు. అమ్మ బోధగురువు కాదు, బాధగురువు కాదు, అమ్మకి సాటి అమ్మే అని ముక్తకంఠంతో చాటారు.
శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం: ‘అమ్మే మనకి గురువు, దైవం ఏకకాలంలో’ అన్న పూజ్యశ్రీ శివానన్దమూర్తి గారి ప్రబోధమే స్ఫూర్తిగా నేడు మనం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అమ్మ సైద్ధాంతికంగా తత్త్వపరంగా సత్యసందర్శనం చేయించింది. శ్రీ కె.నరసింహమూర్తి గారు, శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు, శ్రీ J.V.B.శాస్త్రి గారు, శ్రీ మధు అన్నయ్య గారు … ఎందరికో దిక్కు, దిక్సూచి అయి చేయూతనిచ్చి స్వయంగా నడిపించింది. మంత్రోపదేశం చేసింది, బ్రహ్మోపదేశం చేసింది. ‘నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో, అంతా వాడే చేస్తున్నాడని నమ్ము’ అనే దివ్య సందేశాన్ని అనుగ్రహించింది’ అంటూ ఆద్యంతమూ సభను రసవత్తరంగా నిర్వహించారు.
శ్రీ V.S.R.మూర్తి గారు: ‘వ్యాసుడు, శ్రీకృష్ణుడు, శంకరులు ఇత్యాది పురుషరూపంలో ఉన్నవారిని గురువులుగా భావిస్తాం. స్త్రీ రూపంలో ఉన్నవారు గురువుకాదా? మాతృమూర్తులందరూ గురువులే. ‘నేను గురువును కాను, మీరు శిష్యులు కారు’ అని అమ్మ అనటం మరుగే తన విధానం కనుక. నేను గురువును, మీరు శిష్యులు అంటే దూరం పెరిగిపోతుంది. నిజంగా అమ్మే గురువు.
దివ్యమాతృ స్పర్శతో ప్రతిఒక్కరికి సమస్య పరిష్కార, ఆనందప్రాప్తి దిశగా సూచన చేసిన సూచిక గురువు – అమ్మ.
సంజ్ఞచేస్తే అందరికీ అర్ధంకాదని మాటలలో – ‘అంతా వాడే (సర్వాంతరాత్మ) చేస్తున్నాడనుకో’ అంటూ తత్త్వసారాన్ని బోధించిన వాచికగురువు అమ్మ. శాస్త్రసారాన్ని తేటతెలుగులో ‘మనస్సే దైవం’ అని ఒక్క మాటలో చెప్పింది. భావనే భగవంతుడు అనేది బృహదారణ్య కోపనిషత్ సారం.
మనం చిక్కుముడిలో ఇరుక్కుపోయిన సందర్భంలో అమ్మ ఆ ముడివిప్పి మనకి విమోచనంచేసింది, మార్గాన్ని సరళతరం చేసింది. అట్టి మోచకగురువు అమ్మ.
అపరోక్షానుభూతి ద్వారా సమస్త జనులకు మార్గోపదేశం చేసిన నిషిద్ధగురువు అమ్మ.
‘నువ్వు ఉద్యోగం చేసుకో, అభిషేకం చేసుకో, పొలం పనులు చేసుకో…’ అంటూ కర్తవ్యాన్ని నిర్దేశించిన దీక్షాగురువు అమ్మ.
మాఘపౌర్ణమినాడు కాలాన్ని స్తంభింపజేసి 500 మందికి మంత్రోపదేశం చేసింది, తనకు ఉపదేశాన్ని చేయవచ్చిన రాజమ్మగారికి మహోపదేశం చేసింది. అట్టి మంత్రగురువు అమ్మ.
కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలు మానవుడితో ముడివడి ఉన్నాయి. కనుక – సత్కర్మలు, సదాలోచనలు చేయాలి, నామ సంకీర్తన చేయాలి అని చేయించిన విహితగురువు అమ్మ. ‘అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు’ అని బోధించింది.
కాబట్టి అమ్మ ఒక పరిపూర్ణగురువు. డా॥ శ్రీపాదగోపాలకృష్ణమూర్తి గారు కన్నుమూసినపుడు అమ్మ వారి కుమార్తె గాయత్రిచే వారి అంత్యక్రియలు చేయించింది. అలా సంప్రదాయాన్ని సంస్కరించిన మార్గదర్శి అమ్మ.
మనం జన్మ ఎందుకు ఎత్తాం? ఎక్కడినుంచి వచ్చాం? ఈ జన్మని ఎలా నడిపిస్తున్నాం? ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? వీటికి సమాధానాలు ఆచరణాత్మకంగా అందించిన అమ్మ కారణగురువు.
వ్యాసుడు లోకగురువు, కృష్ణపరమాత్మ జగద్గురువు. లోకమంతా అమ్మని గురువు అను కుంటుంటే, అమ్మ లోకమే తనకు గురువు అంది. తన వద్దకు రాలేని వాళ్ళని వెదుక్కుంటూ వారి ఇంటింటికీ వెళ్ళిన మానవీయ విలువలుగల ఆత్మవిచారంలోకి నడిపించే సద్గురువు అమ్మ అని ప్రసంగిస్తూ తమ ప్రవచనంలో అమ్మను సంపూర్ణగురువుగా స్పష్టం చేశారు.
శ్రీ A.V.R. సుబ్రహ్మణ్యం: అనేక కోణాల అమ్మను గురుస్వరూపిణిగా ఆవిష్కరించిన శ్రీ VSR మూర్తి గారికి, సాదర స్వాగత వచనాలు పలికిన డా|| B.L. సుగుణ గారికి, ప్రార్థనా శ్లోకాన్ని గీతాన్ని ఆలపించిన శ్రీరావూరి ప్రసాద్ గారికి, ఆసక్తితో పాల్గొన్న ఆత్మీయ సోదరీ సోదరులందరికి ధన్యవాదాలు తెలిపి శాంతిమంత్రంతో సభ ముగించారు.