1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మకు అక్షరార్చన 12 నివేదిక

అమ్మకు అక్షరార్చన 12 నివేదిక

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : January
Issue Number : 6
Year : 2022

డాక్టర్ బి.యల్.సుగుణ : ‘ఈ నెలలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాల్ని నిర్వహించు కుంటున్నాం. విద్య యొక్క లక్ష్యం కేవలం ఉపాధి మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక ధార్మిక చింతన, ఉత్తమ సంస్కారము. భారతీయ సంస్కృతి, అమ్మ దివ్యతత్త్వం తెలుసుకోవాలంటే వేదాలు తెలియాలి. వేదాలు తెలియాలంటే సంస్కృతం తెలియాలి. అట్టి అమర భాషాభ్యసనానికి అమ్మ ఓరియంటల్ కళాశాల స్థాపన ద్వారా ఒక రాచబాటను వేసింది’ అంటూ వక్తలకు, శ్రోతలకు, సభాసంచాలకులకు శుభస్వాగతం తెలిపారు.

డాక్టర్ ఎమ్.బి.డి.శ్యామల ‘యశ్మూ (బ్రహ్మా’ అనే ప్రార్ధనా శ్లోకాన్ని శ్రావ్యంగా గానం చేశారు.

ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి: ‘మహోదాత్త ప్రవక్తగా, అవతారమూర్తిగా, ప్రేమకు ప్రతీకగా, వాత్సల్యవారాశిగా అమ్మ ప్రకటితమవుతోంది. అమ్మ చెప్పినవి చేసినవి మనం చిత్తశుద్ధితో ఆచరిస్తే ఈ లోకం నందనవనం అవుతుంది.

చిన్నతనంలోనే ఎన్నో శస్త్ర చికిత్సలకు గురై భయంకర పోలియో వ్యాధిబారినపడి చక్రాల కుర్చీకి పరిమితమై తాను నడవలేని స్థితిలో ఎందరెందరినో అభ్యుదయ మార్గంలో నడిపిస్తూ చిత్తశుద్ధి ఆత్మవిశ్వాసం దీక్ష ఉంటే అంగవైకల్య ఆశయసాధనకు అవరోధం కాదని నిరూపించిన మహిళ ఆదర్శ మహిళ శ్రీమతి సాయిపద్మగారు.

విజ్ఞానశాస్త్రం ఆధారంగా అనంతత్వమే అమ్మ అని విశ్లేషించుకుని, తన అన్వేషణ ఫలం అమ్మ అని గుర్తించి, తన ఆర్తి – ఆవేదన – ఆరాధనగా అమ్మను అంతరంగంలో దర్శించుకుని, అమ్మ దివ్యదర్శనం అనంత శక్తి సామర్థ్యాలను ప్రసాదించిందని విశ్వసించి, అమ్మ ప్రేమతత్వం విశ్వవ్యాప్తం కావాలని చక్కనిసందేశాన్ని ఇచ్చారు శ్రీరాఘవ మూర్తిగారు. 

అమ్మప్రేమ తత్వానికి దర్పణం పట్టే స్వీయ అనుభవాల్ని తన హృదయంలో పదిలపరచుకుని గట్టిగా రచించి గానం చేయడం, అమ్మకు ప్రతి రూపమైన హేమను నిరంతరం ఆరాధిస్తూ ఆశ్చర్యకరమైన అనుభవాల్ని పొందడం విశేషం. తన విద్య. తన అభ్యుదయం, తన సంగీతం, తన సాహిత్యం సర్వం అమ్మ అనుగ్రహమే అని కృతజ్ఞతా పూర్వకంగా చాటారు చిరంజీవిని ఎమ్.బి.డి. శ్యామల – అంటూ ఆద్యంతమూ అందంగా, అర్ధవంతంగా సభను నిర్వహించారు.

శ్రీమతి పి. సాయిపద్మ: కేవలం 45 రోజుల పసిప్రాయంలో పోలియో సోకి Paralyse అయిపోయాను. శరీరానికి 52 shock treatments ఇచ్చారు. ఉపరిభాగం కోలుకున్నది కానీ రెండు కాళ్ళూ చచ్చుపడ్డాయి. 

 

నన్ను 3-3 1/2 సంవత్సరాల ప్రాయంలో మా అమ్మ ‘అమ్మ’ దగ్గరకు తీసుకు వచ్చింది. అప్పటికి నేను సరిగా కూర్చోవడం లేదు. కూర్చోబెడితే ఒరిగి పోయేదాన్ని. “అమ్మా! కూర్చోవటం లేదు” అని ‘అమ్మ’కు విన్నవించుకున్నది మా అమ్మ. ఎందుకు కూర్చోదు?” అని దగ్గరకు తీసుకుని వెన్ను రాసింది. ఆశ్చర్యం. మర్నాటి నుంచి కూర్చో గలిగాను. ఒక్క ‘అమ్మ’ మాత్రమే సదా వెంట ఉంటుంది. తర్వాత నేనేదో సేవా కార్యక్రమాలు చేయగలిగానంటే అది నా సత్తా, నా ప్రజ్ఞకాదు. అమ్మ శక్తి అనుకుంటాను.

నేటికీ మన సమాజంలో జ్ఞానం ఎంత ఉందో, దాని వెనుక అంత అజ్ఞానం, ఆకలి, చీకటి ఉన్నాయి. వాటి నిర్మూలనకి నా వంతు కృషిపరంగా మా ప్రాజెక్టులో 5000 మంది కుటుంబాల్ని నిలబెట్టాం: లక్షమంది. చిన్నారులకి breakfast పెట్టే దిశగా పనిచేస్తున్నాము. 

కేవలం పదివేల రూపాయిలు ఖర్చు పెట్టి Polio: Corrective Surgery చేయించుకుని, Wheelchairs వారు మనదేశంలో 20 శాతం ఉన్నారు. New York లో ఒక సభకు అతిథిగా వెళ్ళాను. లోగడ నా గొంతు పోయింది. అవిశ్రాంత కృషివలన కర్ణాటక సంగీతాన్ని అభ్యసించా. ఆ సంగతి సభలో మనవి చేయగా, ఒక | ప్రార్ధనా గీతాన్ని ఆలపించాను. ఆశ్చర్యం. ఆ పాటను వాళ్ళు వేలం వేశారు. 7 నిముషాల్లో 50,000 డాలర్లు సమీకరించి డెహ్రాడూన్ లోని ‘Polio Corrective Surgery Center’ కి ఇచ్చారు. Miracle అంటే ఇదే – నేను చేసింది కాదు, దైవసంకల్పం. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’ అంటూ అసహాయులకు తాము అందిస్తున్న ఆపన్నహస్తాన్ని అమ్మ అఘటన ఘటనా సామర్ధ్యాన్ని వివరించారు. 

కుమారి ఎ. మనీషా : శ్రీ పి.యస్.ఆర్. గారు వ్రాసిన ‘నిన్నడుగు దాట నీను – నేనడుగు మోక్షమీక’ – గీతాన్ని ఆర్తితో కమ్మగా గానం చేశారు.

ప్రొ.డి.వి.ఎ.రాఘవమూర్తి : సో. మోహనకృష్ణ గారు ‘Mother of All’ అనే గ్రంథాన్ని ఇచ్చి అమ్మను గురించి వివరించారు. కొన్ని పేజీలు చదివినంతనే నేను అన్వేషిస్తున్న దైవీతత్వం జిల్లెళ్ళమూడిలో ఉన్నది అని తెలిసింది. 2006లో సకుటుంబంగా జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అది వేరే ప్రపంచం, అది ఒక పునర్జన్మ. ఆలయంలోకి వెళ్ళి అమ్మను దర్శించుకున్నాను. నాకు తెలియకుండానే కన్నీళ్ళు ఏకధారగా వర్ణించాయి. కళ్ళు మూసుకున్నాను. అమ్మ దర్శన భాగ్యాన్ని ప్రసాదించింది. నాటి నుంచి అమ్మ నాలో ఉంటోంది, సంభాషిస్తోంది అని తెలుసుకున్నాను. అమ్మ లేని చోటు లేదు. అనంతత్వం (Infinity) అమ్మ అమ్మను గృహంలోనూ, నా మనోమందిరంలోనూ ఆరాధిస్తున్నాను’ అంటూ ఆర్తితో, ఆర్ద్రతో ప్రసంగించారు.

శ్రీమతి యల్లాప్రగడ లలితకుమారి: ‘సర్వం ఖల్విదం అమ్మ’ అనే రాజు బావ గీతాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా వీనులవిందుగా ఆలపించారు.

 

డాక్టర్ ఎమ్.బి.డి.శ్యామల: “అమ్మా! నువ్వు ఇక్కడే ఉండి సంస్కృతం చదువుకో” అని అమ్మ నన్ను కొనుక్కునే స్తోమత లేక వికలాంగుల వలె మిగిలిపోయిన ఆశీర్వదించింది.

ఒకసారి మా అమ్మమ్మకు అనారోగ్యం చేసింది. తనకి సేవచెయ్యటానికి మా అమ్మ వెళ్ళవలసి వచ్చింది. తను పిరికిది ఆవగింజంత ధైర్యం లేదు. ఆ సందర్భంలో అమ్మ నీకు తోడు ఎవరూ లేరని దిగులు వద్దు, నేను ఎప్పుడూ నీతో ఉంటాను” అని ధైర్యం చెప్పింది. కేవలం మాటలే కాదు. -కంటికి ఎదురుగా కదలాడుతూ చిరునవ్వుతో పలకరిస్తూ వెన్నంటి ఉంటూ ధైర్యా న్నిచ్చింది. అది అమ్మకే సాధ్యం. అలా అమ్మ మా కుటుంబాన్ని ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి..

అమ్మ వాత్సల్య తరంగోధృతికి ఒక ఉదాహరణ: ఒకసారి అమ్మ వాత్సల్యయాత్రకి వెళ్ళి తిరిగి వచ్చింది. మేడమెట్లు ఎక్కబోతూ ఆగి, అన్నపూర్ణాలయం నుంచి అడి తెప్పించి బాగా నెయ్యి వేసి ముద్దలు చేసి చుట్టూ చేరిన పిల్లలందరినీ చేరదీసి తినిపించి ఇన్నాళ్ళు నా బిడ్డలకి దూరంగా ఉన్నాను. వాళ్ళని గుండెలకి హత్తుకుని అనురాగరూపమైన అమృతతుల్యమైన గోరుముద్దల్ని తినిపించాలని తహతహలాడింది శ్రీ మాతృహృదయం. ఒకసారి అమ్మ నన్ను పిలిచి “అమ్మా! నువ్వు ఎప్పుడూ లలితా సహస్ర నామం చదువుతూండు. మానవద్దు’ అని చెప్పింది. నాటి రాత్రి హైమక్యయ్య కలలో కనిపించి నాకు ‘లలితాసహస్రం నామస్తోత’ గ్రంథాన్ని ఇచ్చింది. నాకు హైమాలయం అన్నా, హైమక్క అన్నా ఎంతో ఇష్టం.

మా పెద్దపాపను ప్రసవించినపుడు ముందుగానే ఉమ్మనీరు పోయి ప్రమాదం ముంచుకొచ్చింది. నాకేం జరుగుతున్నదో తెలియదు హైమమ్మను ప్రార్ధిస్తున్నాను. ఆ స్థితిలో సునాయాసంగా కానుపు జరిగింది. నా జీవితం, నాజీవనం, నా సాఫల్యం సర్వం అమ్మ ప్రసాదించిన భిక్ష అంటూ అనుభవపూర్వకంగా అమ్మ కృష్ణను, అనుగ్రహాన్నీ, సమదృష్టిని, ఆర్తత్రాణ పరాణయతని రసరమ్యంగా అభివర్ణించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!