శ్రీ డి.వి.యన్.కామరాజు: ‘అమ్మకు అక్షరార్చన’ సభల్లో ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్న వక్తలకు, శ్రోతలకు శుభస్వాగతం తెలిపారు. జూన్ 12, 13, 14 తేదీలలో అమ్మ అనంతోత్సవాల్ని నిర్వహించుకుంటున్నాము. అమ్మ కృపతో అన్ని పర్వదినాలు నిర్విఘ్నంగా, వైభవంగా నిర్వహిస్తున్నాం. అమ్మ అవతరించినదీ, అవనీస్థలిపై నడ యాడిందీ, అనంతత్వాన్ని సంతరించుకున్నదీ మన కోసమే. అమ్మ త్యాగానికి ప్రతిరూపం, ప్రేమకు నిలువెత్తురూపం’ అంటూ అమ్మ అవతార వైలక్షణ్యాన్ని విశదీకరించారు.
శ్రీ కె.శేషాద్రి : డాక్టర్ పన్నాలవారు రచించిన ‘యయా శక్త్యా బ్రహ్మా’ శ్లోక పఠనంతో సభా స్వరూపిణి అమ్మను ప్రార్థించారు. అంజలి ఘటించారు. సృష్టి స్థితి లయ హేతుభూతమైన పరదేవతా స్వరూపిణి అమ్మ అని జ్ఞప్తికి తెచ్చారు.
శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం : మన అనసూయమ్మ రూపం పరిమితం, కానీ శక్తి అనంతం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తమ అవతార పరిసమాప్తి కాగానే నిజధామం వైకుంఠానికి వెళ్ళారు. కానీ ‘అమ్మ’ తన అవతార పరిసమాప్తి చేసి మణిద్వీపానికో, ఎక్కడికో వెళ్ళలేదు. “మీతో నేను, నాతో మీరు. అంతే” అంటూ మనకోసం మన కళ్ళముందు శ్రీ అనసూయేశ్వరా లయంలో సుప్రతిష్ఠితయై అనుగ్రహ దీపప్రభలను ప్రసృతం చేస్తోంది’ అంటూ అనంతోత్సవ తాత్పర్యాన్ని వివరిస్తూ ఆద్యంతం సభను హృద్యంగా నిర్వహించారు.
శ్రీ కె. నరసింహమూర్తి : CABICIWA ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణుడనైనాను. కేవలం అమ్మ ఆశీస్సులు, అనుగ్రహంతో ప్రాక్టీసు పెట్టాను. 1986లో విజయవాడలో అమ్మతత్త్వ ప్రచారానికి శ్రీకారం చుట్టబడింది; అది నాభాగ్యం. 1987 నుండి హైదరాబాద్ లో మా స్వగృహంలో ఏటా అమ్మ ఆరాధనోత్సవం నిర్వహింపబడుతోంది. 300 మంది దాకా సోదరీ సోదరులు హాజరై పూజాదికములలో పాల్గొని అమ్మ తీర్థ ప్రసాదములు స్వీకరిస్తున్నారు; అలా వచ్చినవారు – జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను అర్చించుకున్న తృప్తి కలుగుతోంది అని ఆనందించటం నాకు మహాదానందదాయకం; అది అమ్మ కృపావిశేషం.
ముఖ్యంగా 1995, ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో మా ఇంట్లో అమ్మకు విశేష సేవలనందించిన నోరి మాణిక్యమ్మ, గజేంద్రమ్మ, కృష్ణవేణమ్మ, ప్రభావతి అక్కయ్య, రాజుబావ … మున్నగు సోదరీ సోదరులను సమ్మానించుకున్నాను. అమ్మయే స్వయంగా తరలి వచ్చి నా ఆరాధనని స్వీకరించింది, అనుగ్రహించింది అనటానికి నిదర్శనాలు కనిపించాయి. అది నా మహద్భాగ్యం. సమాజంలో నా ఉన్నతస్థాయికి, శ్రేయోభివృద్ధులకు అమ్మ కృపయే కారణం’ అంటూ సారనయనాలతో మహత్వ అనుభూతిప్రదంగా ప్రసంగించారు.
శ్రీమతి ఎమ్.వీణాధరి : ‘అమ్మా! అమ్మా! అమ్మా! మాకు అభయ మొసంగవె అనసూయేశ్వరి’ అంటూ భక్తి భావస్ఫోరకంగా, శ్రవణానందకరంగా గీతాలాపన చేశారు.
శ్రీ ఐ.రామకృష్ణారావు : ‘ఎవరైనాకలిస్తే వారికి అమ్మ ఫోటో ఇవ్వటము, నాలుగు మాటలు చెప్పటం నా స్వభావం. గోయెల్ అనే వ్యక్తికి అమ్మ ఫోటో ఇచ్చాను. వారు దానిని తదేకంగా చూస్తున్నారు. ఆశ్చర్యం. వారికి క్షణాల్లో కుండలినీ జాగరణం అయింది.
అమ్మ శరీరత్యాగం చేసిందన్న పిడుగుపాటు లాంటి వార్త విని ఏడుస్తూ Bangalore AirPort కి వెళ్ళాను. మద్రాసు వెళ్ళటానికి టికెట్ లేవన్నారు. [ADa e Dired అని రోదిస్తూ పై అధికారిని కలుసుకొని సంగతి చెప్పాను. వారు అన్యమతస్థులు. వారన్నారు You say SHE is MotherÜMOTHER of ALLODiDine Mother incarnation॰SHE has not gone anywhere అని ఓదార్చుతూ నాకు టికెట్ ఏర్పాటు చేశారు.
సాధన అనే అమ్మాయికి అమ్మ ఫోటో ఇచ్చాను. తనకు తర్వాత వివాహమైంది. పిమ్మట తన భర్త వ్యాపారంలో బాగా నష్టపోయాడు. ఆ అమ్మాయి అమ్మ ఫోటోతీసి Ilease saDe e Mother అంటూ విలపించింది. రెండు నెలల కాలంలోనే ఆశ్చర్యకరంగా జీవితంలో నిలదొక్కుకున్నారు.
6 సంవత్సరాల ప్రాయంలో మా అబ్బాయికి Аendicitis Oleration Do Theatre $$3 తీసికెళ్ళారు. నాకు తోడుగా ఎవరూ లేరు. అమ్మ ఉంటుంది అని ధైర్యంగా ఉన్నాను. ఆపరేషన్ అయిన తర్వాత వాడు మొదట అన్నమాట “నాన్నా! అమ్మ కనిపించింది. కుంకుం చల్లి, చేత్తో తడిమింది. “నాన్నా! ఆపరేషన్ చేయించుకో. నీకిష్టమైనవన్నీ తినొచ్చు” అన్నది. అలా ఎన్నో అనుభవాలను అమ్మ అవ్యాజకరుణకు సాక్షులుగా వివరిస్తూ తరచుగా తన కన్నీటిధారలను అడ్డుకుంటూ మనోజ్ఞంగా ప్రసంగించారు.
కుమారి మనీషా : ‘నీ నామమె పావనం, నీ రూపమె భావనం’ అనెడి రాజుబావ పాటను కమ్మగా గానం చేశారు. ఏ ఆపత్సమయంలోనైనా అదే తారకమంత్రం అని స్ఫురింప చేశారు.
శ్రీ విన్నకోట భాస్కరశర్మ : “1977 లో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో” సాహిత్య విద్యాప్రవీణ కోర్సులో చేరాను. అమ్మను తొలిసారి దర్శించుకున్నా. అకారణంగా కన్నీరు వాగులై ప్రవహించి అమ్మ పాదాలను అభిషేకించింది. అమ్మకు కులభేదమే కాదు, గుణభేదమే లేదు. అమ్మ దర్శన, స్పర్శన, సంభాషణ మహద్భాగ్యాన్ని పొందాను. అమ్మ ఒడి మమతల గర్భగుడి, సమతల పెద్దబడి. అమ్మ వాక్యాలు సార్వకాలికాలు, సార్వజనీనాలు. అమ్మ సన్నిధి అపురూప పెన్నిధి’ అంటూ కులపతి, కరుణశ్రీ, పేరాల భరతశర్మ, పన్నాల వారి స్తోత్రరచనలను మనోహరంగా అమ్మ అలౌకిక తత్వసారంగా వినిపించి, అలరించారు. అమ్మ ఆనాడు ఉన్నది, ఈనాడూ ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది – అంటూ అమ్మకాలాతీతమహత్వశక్తిస్వరూపిణి అని ప్రసంగించారు.
శ్రీ డివియన్ కామరాజు: కార్యక్రమం విశిష్టంగా సాగింది. వక్తలు శ్రోతల్ని ఆనంద రసార్ణవంలో ఓల లాడించారు అంటూ పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపి, శాంతిమంత్రంతో సభ ముగించారు.
విజ్ఞప్తి: వచ్చే ‘అమ్మకు అక్షరార్చన – 7’ కార్యక్రమం 4-7-2021 ఆదివారం నాడు నిర్వహించు కుంటున్నాం. అమ్మబిడ్డలందరికీ ఇదే ఆహ్వానం. ఈ కార్యక్రమం మనందరిది. ఇందు పాల్గొని తమ అనుభవాలను పంచుకునే ఆసక్తిగల సోదరీసోదరులు డాక్టర్ బి. యల్. సుగుణ (సెల్: 9491755866) కన్వీనర్ గారిని సంప్రదించగలరు.