1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మకు గుడి

అమ్మకు గుడి

Rajupalepu Seshagiri Rao
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 14
Month : October
Issue Number : 4
Year : 2015

అమ్మా ! నీకొక గుడి కావలెనా?

 చాలునా అమ్మా ! ఒక గుడి నీకు?

 రాతిబండలతో కట్టబడినది 

మూతబండలతో కప్పబడినది

 రాతిసేవకులు తలుపుల దగ్గర

 కన్నులు మూసుకు కావలయుండునది. 

॥ అమ్మా నీకొక ॥

ఈ గుడి కావలెనా ఓ అమ్మా !

 ఏలనమ్మా నీకీ గుడి మా అమ్మా !

చీకటిమయమై, వెలుగేకాక

 ప్రమిదల వెలుగును ఆశ్రయించునది 

పదపద పదమని అర్చకస్వాములు

 నీతనయుల నెడలించునది

తీర్థముకొరకై ఉవ్విళ్ళూరగ

 అదలింపులనే పంచునది

 మాటాడవ నాకన్నతల్లియని

 రోదన చేసెడు నీశిశువులను

 సమయము కాదని – నీఅర్చకులే 

విగ్రహమిది పలుకున? 

పొమ్మని – తరుమునది – ఈ గుడి కావలెనా –

మల్లెపూలవలె – సంపెగలవలె

 మెండుగుభక్తిని పరిమళించునని

గులాబిరేకువలె – నవనీతమువలె

మృదువుగ – కోమలముగ నుండునని

 నీదురాకనై – వేచియుండునని

వచ్చెదవను ఆశల – బ్రతుకుచుండునని

 రమ్మని రావేలని – రాలేదేయని రావేమోనని

తత్తరపడు గుండెల గుడులు

 ఎన్నియున్నవో – తెలిసిననీకు

రాతి గుడులు కావలెనా అమ్మా 

చాలున అమ్మా – ఒకగుడి నీకు ? 

నీతనయుల మృదు హృదయ వేదికల 

రత్నపీఠమున – సుఖముగ కొలువై

పాటలు పాడుచు – నాట్యము సేయుచు

 నిను సేవించెడి బిడ్డలు చూచుచు 

కరుణాన్వితమో చల్లని చూపుల

 పాలపాపలను ఆదరింపుమన

కదలని – మెదలని పలుకని బొమ్మై

ఉండుటయే నా కిష్టమ్మనుచు

 రాతిగుడిని కోరెదవా అమ్మా 

ఏలనె అమ్మా – ఆ బండల చెర

తనయులతో ఉండుట కష్టమ్మా?

 పోట్లాడముగా – మేమేమీ – 

కొట్టిన, తిట్టిన ఓర్చుకోగలమా 

పలుకకుండుటను సైపగజాలము

నీకేలనె మా అమ్మా ఆగుడి

పిలుపులు వినబడని బండల బందీ

– శేషు – 1958

(1958-59 ప్రాంతాలలో జిల్లెళ్ళమూడిలో గుడి లేదు – పునాదులున్నాయి ఒకరాత్రి కల ఈ పాట)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!