1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మకు శతకోటి వందనాలు

అమ్మకు శతకోటి వందనాలు

Dr.U V Girish Kumar
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : March
Issue Number : 8
Year : 2014

ఓ జగజ్జననీ ! విశ్వజననీ ! అనసూయామాతా !

అందరికీ ఆత్మీయతను పంచి మాలో

నీ మాతృత్వ ప్రేమ భావాన్ని నింపినావు

నీకు ఇదే మా శతకోటి వందనాలు

నీవు నేర్పిన ఈ భావనయే మాలో

సోదర సోదరీ తత్వాన్ని మేలుకొలిపింది

ఈ తత్వమే నీ ఇంటిని “అందరిల్లు”గా చేసింది

నీకు ఇదే మా శతకోటి వందనాలు

జయహోమాతా ! అను నీ నామమే

మాలోని నరనరాల్లో ప్రవహిస్తున్నది.

మా యీ మనుగడకు కారణభూతమైన

నీకు ఇదే మా శతకోటి వందనాలు

కాశీలోని అన్నపూర్ణవే జిల్లెళ్లమూడిలో అవతరించి

“అందరింటికి” వచ్చిన వారందరకు ఆకలి దప్పికలు తీర్చి

అన్నపూర్ణాలయంలో అన్నీ నీవయిన మా కన్నతల్లీ !

నీకు ఇదే మా శతకోటి వందనాలు

చదువుల సరస్వతివైన ఓ మంగళమూర్తీ !

అధ్యయనమే సూత్రముగా విద్యాసంపదలు

నీ బిడ్డలకు కుడువబెట్టంగ చూసిన ఓ మాతృశ్రీ

నీకు ఇదే మా శతకోటి వందనాలు

ధన్వంతరీ రూపాన ఇలకుదిగిన రాజరాజేశ్వరి !

రోగభూయిష్టమైన ఈ దేహమునకు

ఉపశమనమును కలిగించిన నీ దివ్యస్పర్శకు

నీకు ఇదే మా శతకోటి వందనాలు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!