అమ్మ తత్త్వప్రచారసమితి అధ్యక్షులు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిని హైదరాబాదులోని “హెల్త్కేర్ ఇంటర్నేషనల్ సంస్థ” వారు “గ్లోబల్పీస్” అవార్డుతో సత్కరించారు. అమెరికాలోని “గ్లోబల్ పీస్ ఫౌండేషన్” అంతర్జాతీయ సంస్థకు అనుబంధంగా ఉన్న రాష్ట్రశాఖ వారు సెప్టెంబరు 20వ తేదీ సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ప్రపంచశాంతి దినోత్సవసభలో ఈ అవార్డు ఇచ్చి, సత్కరించారు. వివిధ రంగాలలోని ప్రముఖలకు ఇచ్చే ఈ అవార్డుకు సాహిత్యరంగంలో శ్రీ మల్లాప్రగడ ఎంపిక అయ్యారు.
ఈ ప్రపంచశాంతి పురస్కారం కేవలం అమ్మ అనుగ్రహఫలితమనీ, అమ్మ ఆశయాలు విశ్వవ్యాప్తమైతే, ప్రపంచశాంతి సాధ్యమనీ ఈ సందర్భముగా శ్రీమన్నారాయణమూర్తి అన్నారు. శ్రీమల్లాప్రగడకు అమ్మ ఆశీస్సులను, సోదరులందరి పక్షాన అభినందనలను “విశ్వజనని” అందిస్తోంది.