‘అమ్మ’ అంటే మన కరణంగారి కుమార్తె జిల్లెళ్ళమూడి కరణంగారి భార్య కాదు. లోకకళ్యాణం కొరకు అన్న దాన మహిమ చాటుటకు వచ్చిన అవతారమూర్తి. శ్రీరామచంద్రుడు, విష్ణుమూర్తి వలె మానవ రూపమ పొందిన ఆదిశక్తి అమ్మ ప్రేమ అప్పటి యుగధర్మమును అనుసరించి శ్రీరామచంద్రుడు గాను, సృష్టి, విష్ణుమూర్తి మానవమూర్తులు అవతరించి ధర్మమును ప్రబోధించిన అవతారమూర్తులుగా పేరుపొందారు.
ఇప్పటి యుగధర్మం ప్రకారం ధర్మరక్షణ ఏ విధముగా కాపాడవలెనో ఆ విధముగా ప్రేమరూపిణిగా ప్రవర్తించి ప్రబోధించిన తల్లి – అమ్మ – ఈ యుగమందు అన్న ఆర్తులకు ఆకలిగొన్నవారికి అన్నము పెట్టి క్షుద్బాధ నివారించుటయే మంచి మార్గమని తలచినది. అమ్మ అందులకు అమ్మ సందేశము. నీకు వున్నది తృప్తిగా తిను. ఇతరులకు పెట్టునప్పుడు ఆదరణ భావముతో పెట్టు, అయిష్టముగా పెట్టు వద్దు – నిండైన మనస్సుతో చెప్పిన సూక్తి ఈ సూక్తిని అనుసరించి, అమ్మ భావించిన నాటి నుండి ప్రతి పురాతన దేవస్థానములో అన్నదానము జరుగుచున్నది. అమ్మ అవతారమునకు పూర్వము యీ అన్నదానము ఇంతగా జరుగలేదు – అమ్మ అవతారము సార్థకమైనది. అమ్మ సిద్ధాంతము ఆచరణీయమైనది.
కులాలు గాని, మతాలు గాని లేవనియు, సర్వప్రాణులు సమానమని ఆచరణలో చూపిన తల్లి అమ్మ.
అమ్మ ఎవరు ? ఈ జిల్లెళ్ళమూడిలో మానవ అవతార మెత్తిన చైతన్య స్వరూపమే – జిల్లెళ్ళమూడి అనసూయామాత.