“బాలాత్రిపురసుందరి అంటే… బాల అంటే వుటక, త్రిపురసుందరి అంటే బాల్య, యౌవన, కౌమారస్థితులు కలిగినటువంటిది. బాలాత్రిపురసుందరి అంటే – సృష్టి స్థితిలయాలు, భూత భవిష్యత్ వర్తమానాలు, సర్వమూ ఆమె రూపమే. ఆమె అంటే చేతులూ, కాళ్ళూ, చీర, రవికా కలిగిన ఆమె కాదు; శక్తి. అంటే ప్రతీదానిలో గర్భితమయిన శక్తి. ఆ శక్తియే ఆమె.”
“ముగురమ్మల మూలపుటమ్మ అంటే, ఆదియై, అనాదియై ఈనాటికిది అయింది. ముగ్గురు మూర్తులకు తల్లి మూలపుటమ్మ మూడు భాగాలై అన్ని అవస్థలు మూడుగా చేసి, తను త్రిపుటియై, బాలై, – బాలాత్రిపురసుందరై, మూడు గుణములు, మూడు కాలములు, మూడు పుటలు, అవస్థలు మూడు, శరీర భాగాలు మూడు, మూడుమూర్తులై ముగ్గురు మూర్తులకు భార్యలై, ఆ మూడే సత్త్వ, రజ, స్తమో గుణములై, ప్రపంచమై ఒక భూతములో నుంచి అనేకంగా మారి పంచబడ్డది. అందుకే నాకు ఆధారం కావలసి వచ్చింది”.