- అమ్మను మది నమ్మినచో
కమ్మని నీ కలలు కార్యరూపము దాల్చున్
అమ్మను నమ్మిన బమ్మెర పోతన
కమ్మని కలలన్ని దీర్చె కమనీయముగా.
- సిరిని పూజించిన యిచ్చును సిరులతల్లి
శారదను పూజింప ఇచ్చును చదువు లొకటే.
మరి అమ్మను గురి పూజించిన
సిరులు మరియు చదువు శీఘ్రము కల్గున్.
- జిల్లెళ్ళమూడియె ఇలలో
కల్లోలము లేనిచోటు ధరలో ఎపుడున్
చల్లని తల్లియె కొలువై వుండగ
కల్లోలమున కేది చోటు కలిలో ఎపుడున్.
- తప్పులన్నవి కన్పడవు తల్లి కెపుడు
మెప్పు కోరదు ఏ తల్లి మచ్చుకైన
చెప్పి చేయ మనదు చేసి చూపు
గుప్పెడంత మదిని తృటిలోన చదివేను.
చెప్పి వేయును మదిలోని తలపు లెల్ల!