మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి
చూచితి నొక్కనాడు యొక చల్లని జిల్లెలమూడి అమ్మ నున్
చూచిన తోడుగానె మది చేరెను ఎల్లలు లేని హాయి నిండగాన్
పూచిన పూవులల్లె, ఎల చిఱ్నగ వుంగన చిత్తశాంతియున్
వేచిన భక్తులకెల్ల నర్కపురి ‘అమ్మ’యె నిచ్చునంత శక్తియున్
అనయము వచ్చు చుంద్రు రర్కపురి నర్చన సేతురెల్లవేళలన్
వినయము నేర్చుకొంద్రు ఇట వెల్గును జూచియె వారి చిత్తముల్
వినుటయెమాటగాని మరివేయగలేరు మరొక ప్రశ్నయున్నిన్
గనుటయె మాకు ముక్తి, ఇలకావుము మమ్ముల ‘కల్పవల్లిరో’
మంచియు మాటలేదు, ఇల మానుషవర్తన మాయ మయ్యెగా
వంచన చేయువారికిని వేయి విధమ్ముల పేరు గల్గగా
మంచిగ వర్తనన్నడపగమించెను వానికి కష్టనష్టముల్
మంచిని మట్టుపెట్టుట యమానుషమన్గడచోద్యమమ్మరో
అంచల రీతియున్ నడకలల్లన చూచితి నీమహోన్నత దృ
గంచలమున్ భవత్పదము వీడక విస్తృత తత్త్వమున్ మదిన్
సంచలనమ్ము గల్గి మరి సాధు జనాన్విత తత్యులయ్యె లెందరో
చంచల చిత్తులన్ కనుమ, చంచలచూపుతో కావుమమ్మరో
జగమున నీతిలేదు గద జాతుల భేదము లేదటంచయున్
అగపడ గూడదటంచు ‘ఇల’ నందరునూ సమానమే యటంచు యెంచ
క్కగ తీయ తీయగా పలికి గొంతులు కోయును మెత్తమెత్తగా
జగమున నిట్టివారి కొనగూడునె పెద్దఱికమ్ము ‘అమ్మరో ‘
వగచిన వారి సందరు వేగమె కావుము ఎల్లవేళలన్’ –
– స నా రె (కలం పేరు)