అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
అత్రిసతియై వెలుగొందిన యమ్మ
శక్తిగా మెరసినయమ్మ
చిదనవిభాసిత సుస్మితయమ్మ
సాంఖ్యమే దర్శనమైన యమ్మ
తన ప్రేమను ఆస్తిగపంచు నమ్మ
సమభావములౌక్యము ఉన్న యమ్మ.
ఆనందపు రూపు అమ్మ
పరిపూర్ణ పరాత్పరమైనయమ్మ
నిర్మలముదితాంతరంగ స్థిరమైనట్టి యమ్మ
మురారికమ్మ
భూమినే తల్లిగగొన్న యమ్మ
ధ్యానయే ధ్యానమటంచును చెప్పు అమ్మ
నిర్ధూతభవాగ్ని భావగత యమ్మ
మహామహితాత్మ యమ్మ
సర్వార్థశివంకరత్వమగు అమ్మ
కృపాళువు ఐనయమ్మ
అన్నపూర్ణమ్మ భవాబ్ధితారకసమన్వితరామము అమ్మ
సూర్యచంద్రాదులనేలు నమ్మ
గతితప్పని మౌనమునూను అమ్మ
కలికాలమదార్చిగనున్న యమ్మ
పురుషునిలోన తానయయి
ఆత్మకు ఆత్మయెయైన యమ్మ
దేవాత్మగ సర్వరూపముగ భేదములేనటువంటి యమ్మ!
వర్ణాదులులేక మానవుల జీవుల బ్రోచెడు గొప్ప యమ్మ
అనసూయగ తాను రాజిలుచు
అందరిలో కొలువైన యమ్మ
సిద్ధస్థితయోగగమ్య
పరమాత్మికాయై వెలుగొందు అమ్మ
నామాదులు చేరలేని మహిమాన్విత మానుషరూప యమ్మ
నేనేమని చింతచేసెదను ధ్యాసకుగమ్యము
అమ్మయే యిలన్