1) Mr. Ian Duncan 23-10-22న హృద్రోగ సమస్యలతో ‘అమ్మ’లో ఐక్యమైనారు. సోదరులు
Duncan వారి సతీమణి Ms.Leslie తో వచ్చి 1970 దశకంలో అమ్మను దర్శించుకున్నారు. నాటి అందరింటి సభ్యులకు ఆ దంపతులు సుపరిచితులే.
2) అమ్మ చలనచిత్ర దర్శకులు కీ.శే. M.S.N.మూర్తిగారి ధర్మపత్ని శ్రీమతి సీతాలక్ష్మి గారు 5-11-22 మధ్యాహ్నం అమ్మలో ఐక్యమైనారు. 1970-80 దశకంలో అక్కయ్య అనుదినం అమ్మ సన్నిధిలో సంధ్యావందన కార్యక్రమాల్ని శ్రావ్యంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించేవారు.
3) శ్రీ భట్టిప్రోలు దత్తాత్రేయులు గారు 24-11-22న గుండెనొప్పితో అంతిమశ్వాస విడిచారు. శ్రీ దత్తాత్రేయులు గారు శ్రీ షిర్డీసాయి పరమభక్తులు, అమ్మకి బంధువు, డాక్టర్ బ్రహ్మాండం రంగశాయి గారి మామగారు.
4) కీ.శే. వెంకట్రావుగారి భార్య శ్రీమతి ఆదిలక్ష్మిగారు 24-11-22న అమ్మలో ఐక్యమైనారు. శ్రీ వెంకట్రావు గారు, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు చిరకాలం అన్నపూర్ణాలయంలో విశేష సేవల నందించారు.
వీరందరి కుటుంబసభ్యులకు శ్రీవిశ్వజననీపరిషత్ ఉభయట్రస్టులు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతినితెలియజేస్తున్నాయి.