సోదరులు శ్రీ పి.వి.శివరావుగారు 24.8.2022వ తేదీ ఉదయం హైదరాబాదులో పరమపదించారు. చిరకాలంగా అమిత భక్తి విశ్వాసాలతో అమ్మను ఆరాధిస్తూ, పరిమళ సాహిత్య కుసుమాలతో అమ్మను అర్చిస్తున్న ప్రఖ్యాత రచయిత్రి, అందరింటి సోదరి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారు శ్రీ శివరావుగారి సతీమణి.
సోదరి విజయలక్ష్మిగారికి, వారి కుటుంబ సభ్యులకూ శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తోంది.