- మాన్యసోదరులు కీ.శే. చాగంటి వెంకట్రావుగారి ధర్మపత్ని శ్రీమతి సుందరమ్మగారు 7-10-2022న అమ్మలో ఐక్యమైనారు.
- అందరింటి సోదరులు శ్రీ మందపాటి ఓంకారకృష్ణమూర్తిగారు 14.10.2022న అమ్మలో ఐక్యమయినారు. వారు అమ్మభక్తులు శ్రీ ఎమ్ వి యన్ చరణ్ గారి తండ్రి మరియు మాతృశ్రీ పాచ్యకళాశాల అధ్యాపకురాలు డాక్టర్ మృదుల గారి మామగారు.
- అమ్మ అనన్యభక్తులు కీ.శే. భట్టిప్రోలు చలపతిరావు గారి ధర్మపత్ని, శ్రీ భట్టిప్రోలు రామచంద్రగారి మాతృమూర్తి మరియు మాతృశ్రీ ప్రాచ్యకళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బి.యల్.సుగుణగారి అత్తగారు అయిన శ్రీమతి సుశీలాదేవి గారు 18-10-22న అమ్మలో ఐక్యమైనారు.
వీరందరి కుటుంబసభ్యులకు శ్రీ విశ్వజననీపరిషత్ ట్రస్ట్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తోంది.