శ్రీ యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్యం గారు బుద్ధిమంతుడు అన్నయ్యగా అందరింటి సోదరీ సోదరులకు సుపరిచితులు. త్రికరణశుద్ధిగా అమ్మసేవలో తరించిన ధన్యులు; అమ్మ అనుగ్రహంతో అమూల్య అనుభవాలు పొందారు. అమ్మ నిర్దేశించిన (అనుగ్రహించిన) దీపావళి, ఆంగ్ల సంవత్సరాది, పవిత్రోత్సవాల నిర్వహణలో దశాబ్దాలుగా స్వయంగా భాగస్వాములవుతున్నారు. శ్రీ బుద్ధిమంతుడు అన్నయ్య 3-9-22 రాత్రి అమ్మలో ఐక్యమైనారు.
సోదరి శ్రీమతి కొండముది వెంకాయమ్మ 6-9-2022 ఉదయం అమ్మలో ఐక్యం అయ్యారు. కీ.శే. కొండముది బాలగోపాల కృష్ణమూర్తి (గోపాలన్నయ్య) అమ్మకు అంకితమై విశిష్ట సేవలు అందించటానికి సంపూర్ణ సహకారం అందించిన ధర్మపత్ని శ్రీమతి వెంకాయమ్మ.
శ్రీమతి పులుమాటి సుగుణ 19-9-22 ఉదయం హైదరాబాద్ లో అమ్మలో ఐక్యమైనారు. శ్రీమతి సుగుణ కీ.శే. డాక్టర్ పులుమాటి వెంకటనారాయణ గారి ధర్మపత్ని. శ్రీ వెంకట నారాయణ గారు మెహబూబాబాద్ డాక్టరుగా సుపరిచితులు. ఆ దంపతులకు అమ్మ ఆరాధ్యదేవత, అమ్మ బిడ్డలు ఆత్మబంధువులు.
శ్రీ రాజుబావ గారి కుమార్తె శ్రీమతి గంగరాజు సుహాసిని ది. 30-9-2022న హైదరాబాద్లో అమ్మలో ఐక్యమైనారు. శ్రీ రాజుబావ వారి ధర్మపత్ని ప్రభావతి అక్కయ్య, వారి సంతానం అందరూ చిరకాలంగా జిల్లెళ్ళమూడితో సన్నిహిత సంబంధం కలిగి అమ్మను తమ ఆరాధ్య దైవంగా అర్చిస్తున్నారు.
పై కుటుంబసభ్యులకు శ్రీ విశ్వజననీపరిషత్ ట్రస్ట్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తోంది.