1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మా! రాజరాజేశ్వరీ!!

అమ్మా! రాజరాజేశ్వరీ!!

Nandigama China Devi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : October
Issue Number : 3
Year : 2021

అడుగడుగున కాపాడే ఓ అమ్మా! రాజరాజేశ్వరీ!

ఆశీర్వదించుము తల్లీ నీ చల్లని చూపులతో 

ఇలలో నీవే – మా ఇలవేలుపు తల్లి 

ఆదరించి ఆదుకునే కల్పవల్లీ!

ఉదయించే సూర్యునివలె నీ నుదిటికుంకుమ

ఊయలలూగే నాడెందము ఆ రవి బింబము చూచి,

ఋతువులలో శరదృతువు జాబిల్లి లా

వాత్సల్య శాంత శీతల జ్యోత్స్నలను కురిపించును

నీ వదనమండలము ఏమి వర్ణింతును

ఆ కరుణామృత దృక్కులను – మానవాళి మహద్భాగ్య రేఖలను.

ఐశ్వర్యప్రదాత్రి – ఆనంద సంధాత్రి 

ఒక్కమాట చెప్పావంటే – అది సకల జీవనసారం

 మార్గదర్శకం – మోక్షప్రదాయకం. 

ఓనమాలు నేర్చుకుంటాం నీ ఒడిలో నీ బడిలో,

 రూపుదిద్దుకుంటాం నీ వరవడిలో

 నీ జీవిత మహోదధిలో తరంగ నాదం – వేదం

నీ పలుకులు – నీ సూక్తులు బ్రహ్మసూత్రాలై

 తరతరాలు విని తరించాలి, ఆచరించి పరవశించాలి!

ఇంటింటా – సర్వేసర్వత్రా – సకల మనోమందిరాల్లో

నీ కీర్తి, నీ పిలుపు, నీ ఆదరణ, నీ కృప వెల్లివిరియాలి!!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!