‘జయహో మాత’ యటంచు పల్కు టొకటే సార్థక్య మీ జన్మకున్,
దయతో ‘శ్రీ అనసూయ!’ నన్ను గనుమా! ధన్యత్వమున్ గూర్పుమా!
భయ శోకంబుల పారద్రోలి, జగదంబా! ‘రాజరాజేశ్వరీ!’
ప్రియమారంగను ‘శ్రీ పరాత్పరి’! శివా! విజ్ఞాత్రి ! నన్ బ్రోవుమా!
ఒక మాటెవ్వరి పేరు కర్ణములలో ఓంకారమై సోకునో
సకలాఘమ్ముల గూల్చి మానసిక విశ్రాంతిన్ ప్రసాదించునో
సుకరమ్మై పలుకంగ జాలియెడదన్ శోధించునో మంత్రమై
అకలంకంబగు వెన్నెలై వెలుగు ‘అంఆ’ నామమే ధాత్రిపై