అన్నార్తుల ఆక్రందనలు ఆలకించి ఈ అర్కపురిలో తల్లివై తొలివై
నిర్భాగ్యుల నీరాజనాలు అందుకొని ఆకలి అర్హతగా ఎంచి
రాగద్వేషాలు కక్షాకార్పణ్యాల మధ్య కలిజనుల వేదన రోదన లాలకించి
నలిగిపోయే దీనజనావళిని ఆదుకునే అభయహస్తం అసలు సిసలు బ్రహ్మయే కనులు విప్పిచూడరా
దివినుండి భువికి ఏతెంచి అసూయలేని అనసూయ అవతరించె చూడరా
పుడమి తల్లిని పునీతం గావించి