ఇది ఒక వ్రాత లేదా ఒక చేవ్రాలు గురించి ఒక మధురజ్ఞాపకం. మొదట ఒక విశిష్టమైన వ్రాత గురించి ప్రస్తావిస్తాను. ఆ ప్రాత చెరగనిది మనం మార్చలేనిది. దీనిని మరో మాటలో చెప్పాలి అంటే అది తప్పించలేని విధివ్రాత. కానీ అమ్మ మనలో ప్రతి ఒక్కరి కోసం ఎంతో వ్రాసింది కొన్ని స్వల్ప మార్పులు చేరికల అనుమతితో. ఆమ్మ నిర్దేశం తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఆసక్తిగా చూసేవి జరగక పోవచ్చు.
ఏదైనా మార్పు ఉంది అంటే అదీ ముందుగా చేసిన నిర్ణయంలో భాగమే అయి ఉండాలి. అంటే ఆ నిర్దేశం అంత కనికరం లేనిదా? హేతుబద్ధంగా ఆలోచించే ప్రతిమనిషికి ఇది ప్రశ్నార్థకమే!
ఒక వేళ ఆశించినవన్నీ పూర్తి అయినప్పటికీ ప్రతి ఒక్కరూ మరింత ‘ఆశిస్తారు. ఎల్లప్పుడూ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటారు. -మానవుని ఉద్దేశ్యాలు, కోరికలు ఎల్లప్పుడూ. ఆశాజనక దిశలో కదులుతూ ఉంటాయి.
మనకు వీధిలో వ్రాసినవే కొన్ని విశిష్ట అవకాశాలు వస్తాయి. మామూలుగా ప్రతి ఒక్కరూ ఎక్కడో అక్కడ ఉద్యోగమో, తనకు అప్పగించినవనో, లేదా వృత్తి, లేదా మరోపని చేయటం ద్వారా జీవనభృతి పొందుతారు. సాధారణంగా జీవితం సాగించే పద్ధతి ఇది
కొన్ని సార్లు కొందరి అదృష్టం అమ్మ సన్నిధిలో నివసిస్తూ, అమ్మ దగ్గర పనిచేసుకుంటూ, పని వివరాలు అమ్మకే నివేదించుకుంటూ ఉంటారు. ఇది ఖచ్చితంగా గొప్ప ఏకైక అవకాశం. ఇది అమ్మ దర్శనం తరుచుగా చేసుకుని అమ్మ కృపకు పాత్రులయ్యే ప్రత్యేక అదృష్టాన్ని కలిగిస్తుంది. అట్లాంటి అదృష్టం చాలా తెలియని ప్రయోజనాలు తీసుకువస్తుంది.
అందులో ప్రప్రధమంగా దాదాపు అతనికి తెలియకుండానే అతని వ్యక్తిత్వం ఉన్నత తత్వాన్ని సంతరించుకుంటుంది. ప్రొఫెషనల్ నైపుణ్యాలు బాగా క్రమబద్ధం చేయబడతాయి, మరియు సంపూర్ణంగా మెరుగుపరచబడతాయి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పని చేసినా వారి పనులకు నైపుణ్యం అబ్బుతుంది. ఇది వ్యక్తిత్వానికి అదనపు కోణాన్ని జోడిస్తుంది మరియు సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.
చేతనంగానో లేదా తరచుగా అచేతనంగానో, వ్యక్తి ఉత్తమ ఆధ్యాత్మిక సంబంధాలకు గురవుతాడు. మరియు అతని ప్రయత్నాలన్నీ వ్యక్తిని మరియు అతని జీవితాన్ని ఖచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళేవిధంగా సాధన రూపంలో రూపొందించ బడతాయి. వ్యక్తి ఉన్నతమైన పరమ ఆధ్యాత్మిక ఎత్తులు తక్కువ కష్టంతో పెంపు చేయబడతాయి. ఎందుకంటే అమ్మ కృప. వృద్ధి చెందుతుందిగా. అది అతనిని ప్రభావవంతంగా నడిపిస్తుంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పని చేసే వాతావరణాన్ని జాగ్రత్తగా గమనిస్తూ, అమ్మను ఎల్లప్పుడూ జాగ్రత్తగా గమనించటం మంచిది. అటువంటి ఓపిక, భక్తి శ్రద్ధలు ఎప్పుడూ ఉంటే జీవితంలోని సమస్యలకు అమ్మ సూచనలు ఎప్పుడూ ఉంటాయి. స్థిరమైన ప్రయత్నం ఉంటే లౌకికమైనవాటికి కూడా ఆధ్యాత్మికతతో అనుసంధానం జరుగుతుంది. ఇష్టంగా నేను గుర్తు చేసుకునేది. నాకు కూడా ఆ అవకాశం కలిగింది. అమ్మ దగ్గర పనిచేసే అదృష్టం కలిగింది.
ఆ రోజుల్లో నేను ప్రతి ఉదయం విధిగా అమ్మకు రిపోర్ట్ ఇచ్చే వాణ్ణి లేదా రోజు ప్రారంభించడానికి ముందు ప్రతి ఉదయం అమ్మ ఆశీర్వాదాలను కోరేవాణ్ణి.
అమ్మ ఏదైనా ఆదేశాలు ఇస్తే వాటిని దలదాల్చి, వాటిని నిర్వహించి, ఆ విషయం అమ్మకు నివేదించుకోవటం సామాన్యంగా జరిగేది. సామాన్యమైన భాషలో చెప్పాలంటే ఈ విషయాలలో అమ్మ అందరి అధికారులలాగానే చాలా పట్టింపుగానే ఉండేది. ఇంకా అమ్మ ప్రతి వారి విషయం చాలా జాగ్రత్తగా పట్టించుకుంటుండేది. ఉదాహరణకి అమ్మ ఎవరినైనా ఏదైనా పనిమీద ఎక్కడికైనా బయటకు పంపితే చాలా సార్లు అమ్మ ఆ పని ఫలితం తెలుసుకోవటం కోసం సిద్ధంగా ఉండేది మిగతా బయటి పై అధికారుల మాదిరిగానే, అక్కడకి తనకి తెలియని విషయం ఏమీ లేనప్పటికి, విశ్వసాక్షి అయినప్పటికీ చాలా సార్లు అలా బయటికి వెళ్ళిన వ్యక్తులు ఆ పనులు పూర్తి చేసుకుని ఎక్కడా ఆగకుండా త్వరత్వరగా అమ్మ వద్దకు చేరి పరిస్థితులు వివరించాలనే ఉద్దేశ్యం తోనే ఉండేవారు. ఆ ఉద్దేశంతోనే అందరూ త్వరగా జిల్లెళ్ళమూడి చేరేవారు ఎదురు చూసే అమ్మను గుర్తుఉంచుకుని.
మరో విశిష్టమైన వ్రాత అమ్మ సంతకం. అమ్మ సంతకాన్ని అమ్మ చిత్రపటం పై గానీ, కొత్త | అకౌంట్ పుస్తకాలపై గానీ పొందటం కోసం అందరూ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని దొరకబుచ్చుకోవటం అత్యపురిలో నిలిచిపోయిన సున్నితమైన క్షణాలు. మధురమైన జ్ఞాపకాలలో ఒకటి. ఇది ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల్లో జరిగేది. మనలో చాలామందికి నూతన సంవత్సర డైరీలు కొనుగోలు చేసి, నూతన సంవత్సరం లో అంతా మంచే జరగాలని అమ్మ దర్శనవేదిక పైకి వెళ్ళి అమ్మ సంతకం ఆ డైరీలు, కొత్త అకౌంట్ పుస్తకాలపై చేయించుకోవటం అలవాటు..
అనాటి రాత్రి వాతావరణం, ఉత్సాహం, ఉల్లాసం చిరస్మరణీయంగా ఉండేవి. అర్మపురిలో మంచుకురిసే, శీతల రాత్రి అమ్మ అభయంతో కూడిన చిరునవ్వుతో ప్రతి వారిని పలకరిస్తూ సంతోషమైన వాతావరణంలో ఆ డైరీలపై సంతకాలు చేసేది. ఇలా అ జ్ఞాపకాలను మననం చేసుకునేటప్పుడు మధురజ్ఞాపకం తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకో తరుచుగా జరిగేది అది. ఇదీ అమ్మ చేతి వ్రాత చాలా గురించే. అమ్మ అధికారికంగా చేసే సంతకం ఆధీకృత సంకేతం గురించి, జరిగే దానికి తన సమ్మతి ఉందని తెలియచేసే అధికృత సంకేతం.
అమ్మకు జిల్లెళ్ళమూడి లోని భారతీయ స్టేట్ బ్యాంకులో వ్యక్తిగత పొదుపు ఖాతా ఉండేది. ఆ ఖాతాలలో సొమ్ము అమ్మ మాత్రమే తన సంతకంతో అంటే అమ్మ అధీకృత సంకేతంతో డ్రా చేయాలి. మిగతా పరిషత్ ఖాతాలను పరిషత్ వారు నిర్వహించేవారు. సమయాల్లో నేను అమ్మ ఆధీకృత సంకేతం, అదే సంతకం కోసం అమ్మ దగ్గరకు చెక్ బుక్ తీసుకుని వెళ్ళేవాటిని
అమ్మ చాలా తేలికగా తీసుకుంటూ నా వైపు చూసేది. “నేను ఎక్కడ సంతకం చేయాలి?”అని అడిగేది. నేను ఎప్పుడూ “నీకెక్కడ ఇష్టం అయితే అక్కడ చేయమ్మా”అని అనే వాడిని. అమ్మ అలాగే తనకు ఇష్టమైన చోట సంతకం చేసేది, చెక్కు కుడివైపు క్రింది భాగంలో పెట్టాలనే నియమం పాటించాలనేది లేకుండా..
మరలా అమ్మ నన్ను ఇండో ప్రశ్నవేసేది. ఏ రకంగా సంతకం చేయాలి?” అని. నేను నీ ఇష్టమైనట్ల చేయమ్మా! అనే వాడిని. అమ్మ మామూలుగా “అంత” అని రెండు అక్షరాల తోనో, “అమ్మ “అన్న రెండు అక్షరాల పదం తోనో సంతకం చేసేది. సంతకం చేసిన తరువాత చెక్ బుక్ తిరిగి నా చేతికి ఇచ్చేది దాచిపెట్టటం కోసం. నేను ప్రతిసారి ఆ చెక్ బుక్ నుండి చెక్ వేరుచేసి బ్యాంకుకు స్వయంగా తీసుకుని వెళ్లి సొమ్ము డ్రాచేసే వాణ్ణి.ప్రతి శ్రీ సారి నేను ఆ సంబంధిత బ్యాంకు అధికారిని అప్రమత్తము చేసేవాణ్ణి” అమ్మ సంతకం చేసిన ఆ చెక చాలా విలువైన పత్రమని,దాని విలువ భవిష్యత్తులో ఇంకా అని వెలగట్టలేమని,కనుక ఆ చెక్ ను మిగతా కాగితాలను నుండి వేరుచేసి ప్రత్యేకంగా భద్రపరచ మని”. తరువాత వారు ఏమి చేసేవారో మరి.
ఈ తతంగం పూర్తి అయిన తరువాత నేను ఆ సొమ్ము అమ్మ దగ్గరకు తీసుకు వచ్చి ఇచ్చేవాణ్ణి, లేదా ఆ సొమ్ము తో అమ్మ ఏం చెబితే అది చేసే వాణ్ణి. ఇలాంటివే కాదు. అమ్మ వ్యక్తిగత అవసరాలను గమనించి చిన్న మొత్తాలను పంపేవారు కూడా కొందరుంటారు. వారు తక్కువే అయినా.
నిజానికి అమ్మ అవసరం అంటే ఎవరి అవసరాలో తీర్చటమే. అమ్మకు వ్యక్తిగతం అంటూ ఏముంది ఇతరుల మేలు కోసం తప్ప. ఆ సొమ్ము కూడా ఇలాగే పరుల కోసమే వినియోగ పడేది. అలా ఆ పనుల వరసంతా జ్ఞాపకం ఉంచుకోదగిందిగా నా జీవితం అంతా నిలిచిపోయింది. నిలిచిపోతుంది కూడా, పొదుపు ఖాతా కోసం, ఆ సొమ్ము వాడుకునే వారందరిని కరుణిస్తూ, ఈవిధంగా సమస్త విశ్వం యొక్క అధికారిణి, జగన్మాత, బ్రహ్మాండ భాండోదరి, విశ్వభ్రమణకారిణి, సమస్త సృష్టి యొక్క విశ్వ నాటకాన్ని నిర్వహించే అమ్మ. చెక్కులపై సంతకం చేయవలసి వచ్చింది.
తన సంతకంతోనో, వ్రాతతోనో, అనంత విశ్వం యొక్క విధిని సకల జీవరాసులు వ్యక్తి గత విధిని నిర్ణయించే ఆ విధాత ఇలా ప్రాపంచికమైన బ్యాంక్ ఖాతా కొరకు బ్యాంకు చెక్ పై సంతకం చేయాల్సి వచ్చింది. జిల్లెళ్ళమూడిలో అమ్మతో, మరియు చుట్టుపక్కల, నా విధి నిర్వహణ సమయంలోనే కాదు, నా మొత్తం జీవితకాలంలోనే ప్రతిష్టాత్మకంగా మరియు విలువైనదిగా పరిగణించాల్సిన ఘటన ఇది.