అమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చొనగానే నన్నుద్దేశించి రమా ! వెళ్ళి వసుంధరను అడిగి రాగి పాదాలు వుంటై తీసుకొని రా. నీ మెడలో వేస్తానని ఆజ్ఞాపించింది. మా ఇంట్లోనే నాకు మొహమాటం అలాంటిది ఈ వసుంధర ఏమిటో! ఈ శుభలగ్నం ఏమిటో! అర్థంకాని అయో మయంలో అలాగే వుండి పోయాను. మా లతిక, నెల్లూరు | డాక్టర్ మోహనరావు గారి గారాబాల పట్టికి బంగారు పాదాలను తన మెడలో అలంకరింప చేసింది. ఆవిధమైన ఆహ్వానాన్ని, అనుగ్రహలహరిని, ముక్తికి సంప్రదాయంఐన విష్ణుతత్త్వాన్ని, మాలో ఇంకా ఎందరెందరికో అమ్మ అనుగ్రహించింది. నవ్వుల రాణి డాక్టర్ పాప అక్కయ్య, అందరికి తెలుసు. ఇక్కడ మనల్ని ఆలోచింప జేసే విషయం ఏమిటి అంటే కన్న తల్లిదండ్రులతో అమ్మకు సంబంధం లేదు. సంప్రదించలేదు. మా ఇష్టాఇష్టాలతో సంబంధం లేదు. సంఘంలో పరిస్థితిని అసలు పట్టించుకోలేదు. దీన్ని బట్టి అర్ధం అయ్యే సంగతి ఏమిటి? అంటారు. అందుకే, నేనేకని తల్లులకు పెంపకంగా ఇచ్చాననే, వాక్యం ఋజువైంది.
శ్లో॥మనస్త్వం వ్యోమదత్వం మరుదసి మరుత్సారధి రసి
త్వమాప స్వం భూమి స్వయపరిణతాయాం నహిపరం,
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివయువతి! భావేన బిభృషే.
తా॥ ఓ శివశరీరిణి! నువ్వే మనస్సు | ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి తత్త్వలుగా మార్పు చెందుతున్నావు. నీకంటే వేరైనది ఏదీలేదు. నువ్వే నీ ఆత్మను విశ్వస్వరూపంగా పరిణామం చెందించడానికి భావంతో చిదానందరూపాన్ని దాలుస్తున్నావు. అమ్మే – ఆ ఆత్మ- ఆ శివ శరీరిణి.