1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ అసలు శక్తి

అమ్మ అసలు శక్తి

Omkaranamda Giri Svami
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : October
Issue Number : 3
Year : 2022

అనగనగా ఒక అమ్మ

జిల్లెళ్ళమూడమ్మ

అమ్మ గురువు మరుగూ

అమ్మ గురువు మరుగూ

అమ్మ అసలు శక్తి

// అనగనగా //

చిన్ననాట కన్నతల్లి కాలముచేయా

తాను నేనెవరని తనను తాను ప్రశ్నించినదీ.

మాటలేని దేవుళ్ళను వద్దు అన్నదీ

తాను చైతన్యపు ముద్దననీ తెలిసికొన్నదీ.

// అనగనగా //

అనుభవ మివ్వని శాస్త్రము వద్దు అన్నదీ

తాను కన్నదాన్ని వివరించీ చెప్పమన్నదీ.

ధ్యాసే ఎపుడూ ధ్యానము అని చెప్పినదీ

అమ్మ అందరికీ సుగతియనీ వివరించినదీ

// అనగనగా//

చావు పుటక మార్పులనీ నమ్మిన అమ్మ,

తాను జన్మలేనిదారి ఎపుడు వద్దు అన్నదీ

ప్రేమగాను తనకున్నది పంచమన్నదీ

తాను అందరింటి అమ్మగా వెలుగొందినదీ

// అనగనగా//

నాగేంద్రుని తాను కోరి స్వీకరించెను

మననముతో మంత్రమయీ రూపుపొందెనూ

// అనగనగా //

సృష్టి యంత చైతన్యపు స్పందన యనెను

భ్రాంతి లేని బ్రహ్మమునే తాను చూచెను.

గాలి నీరు తిండినీ వదిలివేసెను

యోగముతో అద్వైతము ననుభవించెనూ

// అనగనగా //

అందరినీ సమముగా ఆదరించెను

గుణభేదము కులభేదము వదలివేసెను

ప్రేమతోడ పదిమందికి తనను పంచెను

తృప్తియొకటే ముక్తి యనీ నొక్కి చెప్పెను

// అనగనగా//

మతములలో మర్మములను ఎరిగినయమ్మ

కాలమునూ కరుణనూ గౌరవించెను

రూపులేని మనసు దారి తెలిసినయమ్మ

మనసు తెలిసినపుడు బోధలేదు అనుచు చెప్పెను

// అనగనగా//

కాలమునూ కరుణనూ గౌరవించెను

రూపులేని మనసు దారి తెలిసిన యమ్మ

మనసు తెలిసినపుడు బోధలేదు

అనుచు చెప్పెను

// అనగనగా //

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!