అమ్మంటే ప్రేమకు రూపం
ఆకలితో ఆమెకు వైరం
అవని అంతా ఆమెకు సొంతం
అర్కపురి తన సొంత నివాసం
లక్షలాదిమందికి పెట్టన భోజనం
వేలాదిమందికి పంచిన విద్యాధనం
ఆశ్రితులకు ఇచ్చిన అభయం
అమ్మ ప్రేమకు తార్కాణం
అమ్మ దయాగుణం
అందరిపైనా సమానం
అమ్మ కరుణకు నిలయం
ఆ కృపకు మనం పాత్రులం
అన్నపూర్ణాలయం
అమ్మ హృదయం
ఆకలి రక్కసి పై విజయం
అమ్మ ఆశయం.