దేవాలయం లేని ఒక గ్రామమున దేవాలయ నిర్మాణమూ, సర్వులకు స్వతంత్రమైన భవన నిర్మాణము ఎక్కడెక్కడో భిక్షాటన చేసుకొచ్చి అందరూ కలసి, ఒక చోట కూర్చుని సంతోషముగా కబర్లు చెప్పుకుంటూ అన్నం తినేవారిని చూచి అమ్మ అమితంగా ఆనందపడి అన్ని గ్రామాలలో అందరూ అందరి ఆస్థులు కలుపుకొని ఎవరి వృత్తి వారు చేసుకొంటూ ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుంది అని మనసారా ఆశించింది.
నిర్వహణ
బహుశా జనం రేపు కంటే ఎల్లుండి రావచ్చు. రేపు గోంగూర పులుసుకూరే చెయ్యండి. దాన్నిపప్పు వెయ్యకుండా నీళ్ళు కూడా తగలనియ్యకుండా ఉంచితే వారం రోజులైన ఉపయోగించవచ్చు. సాంబారు పెడతారు గనుక అన్ని రకాల ముక్కలూ వేసి పెట్టండి. పదార్థాలు తక్కువైతే వడ్డన మీకు తేలిగ్గా ఉంటుంది. రవీ, పార్డు, నరసింహం గార్లకు, స్టోర్ రూమ్, గ్లాసులు, చాపలు, డబ్బాలు జాగ్రత్తగా చూడటమూ, ఆ వస్తువులు ఉపయోగించటానికి యిచ్చినప్పుడు యిచ్చి మళ్ళీ అవి గుర్తుగా ఆ వ్యక్తి దగ్గర నుండి తీసికోవటమూ, చిరంజీవి, రామూర్తి లాంటి వాళ్ళకు జనాన్ని అదుపులో ఉంచమని..
ఇట్లా ఎవరెవరు ఏ పని ఎట్లా జాగ్రత్తగా చెయ్యాలో చెప్పారు. పళ్ళు వస్తాయి కనుక పనులు చేసే వాళ్ళంతా హైరానా పడకుండా ఆ పళ్ళు మధ్య మధ్య తీసికెళ్ళి తినమన్నారు. ఒక వేళ అక్కడ సమయానికి వరలక్ష్మి లేకపోయినా ఆ అమ్మాయి కోసం ఎదురు చూడక అవి తీసికెళ్ళమన్నారు. తొమ్మిది అయ్యేసరికి విస్తళ్ళు వెయ్యటం ప్రారంభించాలన్నారు.
వీరయ్యన్నయ్యను పై యెత్తున వుండి ఎక్కడ ఏది కావాలో కనుక్కుంటూ వంట యింటికి, గొడ్ల దగ్గరకు తక్కిన చోట్లకు నీళ్ళు పంపటమూ వంట పని చూడమన్నారు. జిల్లెళ్ళమూడిలో ఒక ఆవిడకు ప్రసవించే రోజులు దగ్గరకొచ్చాయి. ఈ ఊళ్ళో ఇబ్బంది అవుతుందేమో అని అన్నారు.
“ఏం ఫర్వాలేదు అటువంటి పరిస్థితి ఏర్పడితే నేనే మంత్రసాని నౌతాను దిగులు దేనికి” అన్నారు అమ్మ.
వేదం
సహనావవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు
మా విద్విషావహై
కలిసి రక్షించుకుందాం. కలిసి భుజించుదాం. కలసి శక్తిమంతులవుదాం. మనకు తేజస్సు కలగాలి. మనం ద్వేషించుకొనం.