1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ ఇచ్చిన అభయం

అమ్మ ఇచ్చిన అభయం

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : September
Issue Number : 2
Year : 2011

అది 1970వ దశకం. అతను అభ్యుదయ భావాలు గల యువకుడు, చిన్నతనంలోనే తన భావాలకు దగ్గరగా ఉన్న యువతిని ప్రేమించాడు. ఈనాటి యువకుడు లాంటి వాడు కాదు గనుక ప్రేమ పెళ్ళిదాక వచ్చింది. అప్పటికే జీవితం పట్ల సరియైన అవగాహన కలవాడు కావటం చేత తన ప్రేమ వివాహము పెద్దల మనస్సు నొప్పించ కుండా, పెద్దల అనుమతితో జరగాలని కోరుకున్నాడు. అతను లక్కరాజు కృష్ణమోహన్. ఆమె అతని స్నేహితురాలు లక్ష్మి. ఈ మోహన్ ఎవరో కాదు రామకృష్ణ అన్నయ్యకు మేనల్లుడు. అన్నయ్య రెండవ అక్కయ్య సీతమ్మగారి తృతీయ సంతానం. మోహన్ రామకృష్ణ అన్నయ్యకు మేనల్లుడే కాదు, అన్నయ్య భావాలు పుణికి పుచ్చుకున్నవాడు. అన్నయ్య కూడా తనను తాను మోహన్ చూసుకొనేవాడు.

మోహన్ ప్రేమ విషయం సహజంగానే రామకృష్ణ అన్నయ్య దగ్గరకు వచ్చింది. అంతే సహజంగా ఈ విషయం అమ్మ దగ్గరకు వచ్చింది. రూపు దాల్చిన ప్రేమే అమ్మైతే, అమ్మ మోహన్ ప్రేమను ఎందుకు కాదంటుంది ? మోహన్ కల్లిదండ్రులు హనుమంతరావు, సీతమ్మ దంపతులు అమ్మ వద్దకు వచ్చారు. వారి అభ్యంతరాలు అమ్మ ముందు ఉంచారు. పెద్దవారిద్దరికీ పెళ్ళికాకుండా చిన్నవాడికి ఎలా చేస్తాం ? పైగా మోహన్కు ఉద్యోగం లేదు కదా ? ఈ సందేహాలను అమ్మ తనదైన శైలిలో పరిష్కరించింది. జీవన గమనానికి ఆటంకం కల్పించే సాంప్రదాయాలను ఆటకెక్కించమన్నది. అయితే పెళ్ళికి, సంపాదనకు ఉన్న సంబంధాన్ని అమ్మ కూడా అంగీకరించింది. ఆ సంపాదనకు తను “అభయం” ఇచ్చింది. మోహన్కు బాపట్లలోని ప్రెస్ లో ఉద్యోగం కల్పించి వివాహానికి అన్ని ఆటంకాలు తొలిగించింది.

మోహన్, లక్ష్మీల వివాహము తన సమక్షములోనే ఘనంగా ఒరిపించింది. బాపట్లలోనే కొత్త కాపురం పెట్టించింది. అయితే ఆ రోజులలో ప్రెస్ ఆర్థిక పరిస్థితి అయింది. చాలా దయనీయంగా ఉండేది. మోహన్కు ఏర్పరచిన రెండు వందల రూపాయిల జీతము ఒక్కసారిగా కాదు. కదా, రోజుకు పదిరూపాయలుగా తీసుకోవటానికి సహకరించని దుర్భర పరిస్థితి. కొత్త కాపురం నడపటం మోహన్కు చాలా కష్టం అయింది. తాను ప్రెస్కు భారంగా తలచాడు. తనే వేరే చోటుకు వెళ్ళిపోతే ఆ మేరకు ప్రెస్కు తేలిక అవుతుందని భావించాడు. తన ప్రయత్నాలు తాను ప్రారంభించాడు. విషయం రామకృష్ణ అన్నయ్యకు తెలిసింది. అన్నయ్య బాధపడి మోహనన్ను పిలిపించాడు. మోహన్ తన మాటలతో అన్నయ్యను ఒప్పించాడు. అన్నయ్య మోహన్ను అమ్మ దగ్గరకు తీసుకు వెళ్ళాడు. మోహన్ అమ్మకు కూడా తన బాధను వినిపించాడు. అమ్మ మోహన్ దూరంగా వెళుతున్నాడని కాసేపు కన్నీళ్ళు పెట్టుకున్నది. అమ్మ కన్నీళ్ళు చూసి మోహన్ చలించిపోయాడు. కానీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మళ్ళీ అమ్మే తన కర్తవ్య నిర్వహణకు నడుం కట్టింది. హైదరాబాద్లోనే రాజగోపాలచారి గారి ద్వారా ప్రయత్నం చేసి, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఉద్యోగం వేయించింది.

మోహన్ కాపురాన్ని హైదరాబాదుకు మార్చే రోజు వచ్చింది. భార్య లక్ష్మిని తీసుకుని అమ్మ దగ్గరకు వచ్చాడు. అప్పుడు అమ్మ ప్రవర్తించిన తీరు కూతురిని కొత్త కాపురానికి పంపిస్తున్నట్లు ఉన్నది. మోహన్ ఎడబాటు సహించలేక అమ్మ బావురుమన్నది. మోహన్కు, లక్ష్మికి నూతన వస్త్రాలు బహూకరించింది. ఉత్తరీయం కొంగును జోలెగా పట్టుకో మన్నది. ఆ జోలె నిండా బియ్యం పోసింది. ఆ బియ్యంతోనే హైదరాబాదులో “వంట” ప్రారంభించమన్నది. ఆహా ! మోహన్ ఎంత అదృష్టవంతుడు. రెండు గుప్పెళ్ళ అటుకులు సమర్పించి సకల సంపదలు పొందిన కుచేలుడి కంటే అమ్మ నుండి బియ్యం పొందిన మోహన్ నిజంగా ధన్యుడు. అమ్మ ఇచ్చిన అభయం అతని జీవనానికి ఆలంబన అయింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!