అమ్మ ఒడిలోకి పయనం
అయినవాళ్ళ మధ్య నుంచో,
ఐ.సి. యూ లోంచో
‘మేను’ పంజరాన్ని వదలి ‘నేను’ ఎటో ప్రయాణమయ్యింది
హటాత్తుగా దారి ఖర్చులకేమైనా ఉందా?
అని అనుమాన మొచ్చి, జేబులు తడుము కుంది.
…… అన్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్- అమ్మ నామం
చేతికి తగిలి భయమెందుకనుకుంది !
– ప్రసాదవర్మ కామఋషి