అమ్మ ఒడిలో ఈస్థానకవి
తిరిగిచేరారు అమ్మ ఒడిని
అనసూయాపద్మపంకజషట్పదం
ఆరుదశాబ్దాలు ఏలారు ఈ స్థానకవిగా
పాండిత్యం స్వాదుత్వం రాజసికం
మూడు కలిస్తే పీఎస్సార్
అతడు అమ్మ అనే షరాబు వెలకట్టిన నగ
అతడు సిద్ధేశ్వరానందభారతీసోదరుడు
అతడు విశ్వజననిని వడ్డించే పాకయాజి
అతడు అమ్మకు అప్పనచేసుకొన్న ఋణగ్రస్తుడు
అతడు మాటలమూట
కవితలబుట్ట
ఆశువు అతని ఆభరణం
పాండిత్యం అతని లాంఛనం
అతడు ఈస్థానకవి
అమ్మ మరల ఒళ్ళోకి తీసుకుంది
తీరిపోయింది విరహం
కరిగిపోయింది వియోగం
పుట్టుకొచ్చింది అమృతత్త్వం
మృతువెరుగని ఈ కవికి
ఈ స్థానకవికి