1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ ఒడి – అమ్మ బడి – అమ్మ గుడి

అమ్మ ఒడి – అమ్మ బడి – అమ్మ గుడి

Srimathi Giribala Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : October
Issue Number : 3
Year : 2015

అమ్మ ఒడి

అమ్మ ఒడిన్ పరుండటకు అందరు అర్హులే క్రొత్తవార లిం

కెమ్మెయి వచ్చి ఎవ్వరును ఎవ్వరి నెట్టగలేరు పుష్పక

మ్మమ్మ ఒడిన్ తలంప ఇక అచ్చట ఎవ్వరి చోటువారిదే

తమ్మిసుతుఁ డుపేంద్రుడును త్ర్యంబకదేవుడు అమ్మబిడ్డలే –

అమ్మ బడి

సర్వసృష్టియు ప్రేమలో సాగుచుండె

మానవత దైవతత్వాన మసలు ప్రేమ

విశ్వమంతయు ఒక శక్తి వేరు రూపు

ఒక కుటుంబంబుగా సర్వు లుండవలెను.

తల్లిబిడ్డల పెంచుటే ధర్మమనగ

మంచి చెడుల విచక్షణ నెంచుకొనుచు

నడచుకొనుటయె తగురీతి న్యాయమనగ

మంచి చెడులన్ని దైవమే మనకు నిచ్చు

ప్రేరణయె దైవమనుచును ఎరుగవలయు

దిక్కులేని అభాగ్యుని దేవుడనుచు

సేవచేసిన అదె దైవసేవయగును

పరులకష్టాల చేదోడు పడుచునుండి

ఒకరి కొకరుగ సాయాననుండి పండి

ఒక కుటుంబంబుగా నుండు చొప్పుననుచు

అమ్మ బడిలోన నేర్వుడు అంద రెపుడు.

అమ్మ గుడి

గుండెలో కట్టుకొన్నదే గుడియనంగ

అన్నిటన్ కల్గు శక్తియే అసలు దైవ

మానవాలుగ దేవాలయమ్ము సుమ్ము

నామరూపాలు లేనట్టి ప్రేమశక్తి

అమ్మయై వచ్చి నిల్చె నీ అవనిమీద

తెలియనది సర్వులకును తెలియజెప్ప

గలగలలతోడ ప్రవహించు కాల్వలోన

నీరుత్రావగ రేవెట్లు కోరుకొనెదొ

సర్వమయుడైన దేవుని తెర్వు తెలియ

ఆలయమ్మెండు లోకాన అవసరమ్ము

అందరును దేవతలటంచు నరయు కొరకు

బింబమందుండి ఒక ప్రతిబింబమనుచు

హైమకొక ఆలయమ్మునే అమరజేసె

కామధేనువు కల్పవృక్షమ్మంటంచు.

*****

అమ్మ బడిలోన నేరువు మసలువిద్య

అమ్మ గుడిలోని శక్తిని అరయగలవు.

అసలు సిసలైన అమ్మగా మసలు గలవు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!