భారత జాతికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన ఏ జాతులకూ లేని ప్రత్యేకత అది. సహనానికి, పవిత్రతకు, మూలచిహ్నాలై అమృతాన్ని అందించేది గోమాత. గంగామాత. అవి భారతీయులకు మానదండములు, భారతీయులు స్త్రీలకు యిచ్చిన పవిత్ర స్థానం మరే జాతి ఇవ్వలేదు. ఇది భారతీయ సంస్కృతి. పూర్వులు మిగిల్చిన వెళ్ళిన అపూర్వ సంపద.
జాతికి మూలాధారాలైన ప్రేమ, సహనం, ధర్మం, సమానత్వం అన్న వాటికి ఏనాడు ప్రమాదం ఏర్పడుతుందో ఆ రోజు జాతికే కాదు – మానవతకే పతనావస్థ సమీపిస్తున్నదని అర్థం. భారతజాతికి అలాంటి దురవస్థని అడ్డుకోగల శక్తి వుంది. కృష్ణభగవానుడు గీతలో ‘యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత’ ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అని చెప్పారు.
ఆ విధంగా భగవంతుడు మానవాకారం దాల్చి ధర్మ సంస్థాపన చేయడం జరుగుతున్న కార్యమే. ఇందులో కొత్త ఏమీ లేదు. నేటి ఈ సమాజ వాతావరణానికి అనుగుణమై గతి తప్పిన జాతిని ఒక మార్గానికి త్రిప్పి పట్టాలు తప్పకుండా బండిని నడపడం అవసరం. అందుకే ఈ భూమిపై రాముడు, క్రీస్తు, మహమ్మద్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, బుద్ధుడు, షిర్డీ సాయిబాబా, అమ్మ’ ఇలా ఎందరో అవతరించారు!
విశ్వ సంక్షేమ సంధాయక గుణోజ్వలా
విశ్వ ప్రేమమయి ! విశ్వజననీ
విశ్వ కుటుంబినీ ! విశ్వరూపిణీ !
విశ్వ వందితా! అమ్మా ! అభివాదములు
‘అమ్మ’ గుంటూరు జిల్లా, పొన్నూరు దగ్గరలో ఉన్న చూపాయి. మన గ్రామంలో 1923వ (రుధిరోద్గాది నామసంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశిన) అనసూయగా జన్మించింది. బ్రహ్మాండ వంశ సంభవుడైన నాగేశ్వరరావుని వివాహమాడినది. బావట్ల తాలూకా జిల్లెళ్ళమూడిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నది.
అనసూయా దేవి పేరులోనే ఒక విశిష్టత ఉన్నట్లు గోచరిస్తున్నది. అసూయకు అక్కడ తావు లేదు. ప్రేమకే నివాసం. ఆ పేరు వినడంతోనే త్రిమూర్తులను సైతం పసిపాపలను చేసి ఆడించిన ఒక పవిత్రమూర్తి మన కనుల ముందు కనిపిస్తుంది.
అయితే అనసూయాదేవి అమ్మ ఎలా అయింది ? అందరికీ అమ్మ ఎలా అయింది ?
అవతారమనగా పై నుండి క్రిందికి దిగి వచ్చుట. ధ్వజావతరణము అనగా జెండాను క్రిందికి దింపుట అని మనకు అందరికీ తెలిసినదే. ఈ అవతారములు లోకరక్షణ కొరకు, ప్రపంచ శాంతి కొరకు వచ్చుచుండునని మన పురాణ ఇతిహాసములు చెప్పుచున్నవి. ఇట్టి అవతారములకు అన్నింటికీ మూలమైన పరాశక్తి స్వరూపముగా ఈ కలియుగమున అందరిచే ఆరాధింపబడుచున్న ‘అమ్మ’ చరిత్ర అద్భుతము.
పుట్టినది మొదలు ‘అమ్మ’ జీవిత సన్నివేశములన్నియు అత్యద్భుతములే. సర్వవేదముల సారము, సర్వశాస్త్రముల సిద్ధాంతము ఆమె మాటలలో వ్యక్తం అయినాయి. ‘
ఈనాటి ఈ సామాజిక వ్యవస్థ ఒక రకమైన పరిస్థితికి ! దిగజారింది. ఒకనాడు సమాజాన్ని తీర్చిదిద్దిన భారతీయ సమష్టి కుటుంబ సిద్ధాంతం ఈ రోజున విచ్ఛిన్నమైంది. ఈ స్థితిలో మనకు మార్గం నిర్దేశించడానికి ‘అమ్మ’ అవతరించినట్లు ఆమె జీవితం, జీవనం అద్దంపట్టి చూపాయి.
వాస్తవానికి ప్రతి ప్రాణి కన్నులైనా తెరవకముందే అన్వేషించేది కన్నతల్లిని. ఆర్తితో గొంతెత్తి రోదించేది అమ్మకోసం. లోకమంటే ఏమిటో తెలియని పసిపాప పులకింత ‘అమ్మ’. సర్వమూ అమ్మే. ఆ పసిమనసుకు అమ్మ ప్రేమకు మించినదేదీ లేదీ లోకంలో. కానీ ఏ తల్లి ప్రేమ అయినా తన బిడ్డలకే పరిమితం. అదే ప్రేమ విశ్వవ్యాప్తమయితే .. అందరినీ తన బిడ్డలుగా ఎవరైనా ప్రేమించగలిగితే… నమస్త చరాచర జగత్తు తన ఒడిలోని దేనని భావించగలిగితే. … ? ఊహకే అందని ఆ స్థితిని ‘అమ్మ’ 65 వసంతాలు మన మధ్య ఉండి వాస్తవం చేసింది.
అమ్మ పలుకులు పంచదార గుళికలు. అమ్మ వాక్యాలు తేనె వాక్కలు. భాషా జ్ఞానం అంతగా లేని సామాన్యులకు సైతం చక్కగా అర్థం అయ్యేటట్లు వివరించడం ఆమె ప్రత్యేకత. అల్పపదాలతో అనల్పమైన భావం, వాక్చమత్కృతి, శాస్త్రాలను కేవలం వల్లించడం కాక అనుభవ జన్య జ్ఞానం ఆధారంగా విషయ విశదీకరణ ఆమె సొమ్ము. అయితే పదాలు అల్పంగా కనిపించినా భావం చాలా గంభీరమైంది ఉంటుంది.
‘అమ్మ’ అంటే అంతులేనిది, అడ్డులేనిది, అంతము లేనిది’ అని వివరించింది. మీరు ప్రార్థనచేస్తారా అని ఎవరో అడిగితే ‘మీరంతా నేననుకోవడమే నా ప్రార్థన’ అన్నారు. ‘మీరు కావాలనుకోవడమే నా పూజ’ అంది.
అమ్మ నివాస భవనానికి ‘అందరిల్లు’ అని నామకరణం చేసింది. అక్కడ అందరికీ స్వేచ్ఛావాసం ఎవరైనా, ఎప్పుడైనా కాల నియమాలకు అతీతంగా ఆ భవనంలోకి వెళ్ళచ్చు, రావచ్చు.
‘శుక్ల శోణితాలది ఏ కులమో అదే నా కులం’ అన్నది అమ్మ. ‘గుణభేదమే లేని నాకు కులభేదమేమి ? అని మరోమారు ప్రశ్నించింది. హిందూ సంప్రదాయాన్ని పాటిస్తారా ? అని ఎవరో అడిగితే ‘సర్వ సమ్మతమే నా మతం’ అంది అమ్మ తన ప్రేమతో వర్గం లేని స్వర్గాన్ని చవి చూపించింది. మనం తిని, మన చాకిరీతో మరో మనిషికి ఆదరణగా అన్నం పెట్టడం నేర్పించింది. తనకు అంతా శిశువులే కాని శిష్యులులేరన్నది. తాను నిత్యమూ చూలింతనూ, బాలింతనూ అని ప్రకటించింది. మీ సాధన ఏమిటమ్మా అని అంటే ‘పిల్లల్ని కనడమే’ అని జవాబు. రాయాలంటే ప్రబంధాలు తయారు అవుతాయి. డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, కరుణశ్రీ, శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులు, డా॥ దివాకర్ల వేంకటావధాని, డాక్టర్ ప్రసాదరాయ కులపతి, శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మ, నదీరా, శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ ఇలా ఎందరెందరో, అమ్మను గురించి. అనేక గ్రంథాలు, వ్యాసాలు వెలువరించారు.
మే 5న అమ్మ కళ్యాణం, జగత్తే తానై జగత్కల్యాణాన్ని తన సంకల్పం ద్వారా జరిపే అమ్మ కల్యాణం మే ఐదు. ‘జగన్మాత అంటే జగత్తుకు మాత కాదు. జగత్తే మాత అనే విశిష్టమైన అర్థాన్ని ఇవ్వగల కల్యాణి కల్యాణమే మే అయిదు. ‘పెళ్ళిలో పెద్దపులి లేదని’ చాటి చెప్పడానికే సంసారంలో ఉండి కూడా సంసారం అంటకుండా ఉండవచ్చునని నిరూపించడానికి జగదీశ్వరి చూపిన లీలా విలాస దినోత్సవం మే అయిదు.
ఆధ్యాత్మిక చింతనకు పెండ్లి ప్రతిబంధకం కాదని చెప్పడానికే నేను పెళ్ళి చేసుకున్నాని అమ్మ ప్రకటించింది.
‘ఒక పెన్నిధి అండన చేరడమే పెండ్లి అని, ఆ అందన పొందే పరిణామమే పరిణయమని, సర్వాన్ని అనుభవిస్తూ, సర్వాన్ని విడిచి పెట్టేదే వివాహమని, కళంక రహితమైన మనస్సును కళంక రహితంగా మరొక వ్యక్తికి అర్పణ చేయడమే కల్యాణ’మని అమ్మ ఈ కల్యాణ భావనను ఒక మనోజ్ఞము, మహాద్భుతమైన నిర్వచనంగా ప్రసాదించింది.
మంగళసూత్రమే మహాసూత్రమంటూ సూత్రము అంటే ఒక రకంగా ఇముడ్చు కునేది అని అర్థం. దారం బంగారంతో చేసిన తాళిబొట్లతో ఇమిడి ఉంటుంది. దారంలో తాళిబొట్లు ఇమిడి ఉంటాయి. ఒక దానిలో ఒకటి యిమిడి ఉన్నది. ఇముడ్చుకునే శక్తి రెంటికీ ఉన్నది. అదే అర్ధనారీశ్వర తత్వం. అర్థనారీశ్వరుడంటే ఒకదానిలో ఒకటి ఇమడటమే. అలా ఇమిడిపోయిన శక్తిని ఆరాధించాలంటే ప్రత్యక్షంగా మెడలో కట్టిన సూత్రాన్నే అరాధించాలి. దారము, బొట్లు అమ్మ గురించి, అమ్మ చెప్పే విషయాలు వాక్యాలు రెండూ కలిస్తేనే సూత్రం. దారం లేకపోయినా సూత్రం కాదు. బొట్టు లేక పోయినా సూత్రం కాదు. ఆ రెండు బొట్లు భర్తపాదాలు. ఆ పాదాలను ప్రేమ అనే పాశంతో మూడు ముళ్ళు వేసుకుని పట్టుకుని ఉంటుంది. ఆ మూడు ముళ్లే త్రిపుటి. ప్రేమ అంటే భక్తి. భర్తమీద ప్రేమ భక్తి, బిడ్డ మీద ప్రేమ వాత్సల్యం, ప్రేమ ఒకటే కాని స్థానాలను బట్టి పేర్లు మారుతుంటాయి. ఆ రెండు పాదాలే వివాహితులకు శరణ్యం. ఆడదానికి అన్ని సూత్రాలు తెలియవచ్చే సూత్రమే మంగళసూత్రం. ఆ మంగళ సూత్రమే స్త్రీకి మహాసూత్రం. ఆ మంగళ సూత్ర రూపేణ భర్తపాదాలు భార్య కంఠంలో ఎట్లా బంధింపబడి ఉంటాయో యజ్ఞోపవీతం రూపేణాను, కంకణం రూపేణాను భార్య భర్త తోటే సదా ఉంటుంది. ఒకరు తలవంచి (సూత్రం) కట్టించుకుంటే ఒకరు నడుము వంచి కట్టుతారు. ఒకరికి ఒకరు వంగడం తప్పనిసరి. అంటే ఆడపని, మగపని అని పనులలో తేడాలేదు. సంకల్పమే సంసారం అంటూ సంసారంలోని స్వారస్యాన్ని, సామరస్యాన్ని ‘అమ్మ’ వివరించింది.
కూతుర్నీ, కోడల్నీ ఒకటిగా చూసుకొన గల్గిన అమ్మ అద్వైత శిఖరంపై నుంచి జగతికి కల్యాణ వీక్షణాలు. వెదజల్లింది. ‘అమ్మ’ తన కల్యాణ దినోత్సవం నాడు ఎందరికో కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా కట్నకానుకల ప్రసక్తి లేకుండా నిరాడంబరంగా వివాహాలు జరిపేది. అమ్మ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిపించుకోవడం అదొక మహాభాగ్యం. కన్నుల పండుగగా అమ్మ తాళిబొట్టు కట్టి, కట్టించి, తలంబ్రాలు దంపతులపై పోస్తూ, ఎంతో ఉత్సాహంతో ఆ క్రతువులో పాల్గొనేది.
ఆనాడు తన పతిదేవుని పాదాలపై పూలు పోసి, పతి చేత కూడా ఆయనకు తెలియకుండానే తన పాదాలపై పోయించుకుని పతివ్రతకు పరాకాష్ఠ పతి చేత కూడా ‘అమ్మ’ అని పిలువబడి పూజ చేయించుకోవడమనే’ పవిత్ర భావనకు మూలభూతమైనది ఈ కల్యాణ దినం నాడే.
‘భర్త’ అంటే శరీరమే కాదు. భావన కూడా సంఘటనలు కూర్పే జీవితం. ఆశా, అసంతృప్తుల కలయికే జీవితం. అనుకున్నది చేతలలో కనబడుతుంది. అన్నది కనబడదు. చేస్తున్నా పోట్లాడేది కుమారుడు, పోట్లాడుతున్నా చేసేది తల్లి. రూపం పురుషుడు, లోని శక్తి ప్రకృతి. అందరికీ సుగతే, కాస్త ముందు వెనుకలే తేడాగానీ, అంటూ ఎన్నో రసగుళికలను, జీవిత జీవన సత్యాలను మనకు ఎరుకపరచింది.
అమ్మ కల్యాణం లోకకల్యాణం అనటానికి ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలి?
1973లో అమ్మకు స్వర్ణోత్సవం జరిగింది. ఆ రోజున లక్షమంది కుల, మత, వర్గ, వర్ణ విక్షణ లేకుండా ఏక పంక్తిని కూర్చొని భోజనం చేశారు. అది చూచిన అమ్మ ఆనందానికి అవధులు లేవు. అదొక్క అపూర్వమైన సంఘటన.
1983లో అమ్మకు వజోత్సవం జరిగింది. సమాజంలోని జనావళికి నీవిచ్చే సందేశం ఏమిటమ్మా అని పాత్రికేయులు అడిగితే….
‘ఆదరణకు నోచుకోని అభాగినులు, అవిటివారు, అంధులు, దీర్ఘవ్యాధిగ్రస్తులు, ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వారిని దగ్గరకు తీసి ఆదరణతో, ప్రేమతో, పరిపోషించటం ద్వారా ప్రపంచంలో దిక్కులేని వారంటూ ఉండకుండా చూడండి. దిక్కు లేని ఆ అభాగ్యుల లోనే భగవంతుడిని చూస్తూ భగవత్ సేవగా వారికి సేవచేయి. ఒకరి కష్టాల్లో మరొకరు చేదోడు వాదోడుగా ఉంటూ, ఒకరికి మరొకరు సహాయపడుతూ, ఏకకుటుంబంగా, మసలు కోండి’
ఇదే నా సందేశం’, ఆదేశం అని ప్రకటించింది.
కనుకనే అవతార వ్యక్తులు ముఖ్యమైన రోజులన్నీ మనకు పండుగ దినాలు అయినాయి. మే 5 మనందరికీ
సత్ లేకుండా చిత్ లేదు. చిత్ లేకుండా సత్ ఎక్కడుంటుంది ? అన్నీ ఒకటే.