లక్షలాది మందికి అమ్మ అందించిన ఆదరణకు ఆప్యాయతకు
వసుంధరా! ఒక ఉపకరణంగా మలచుకొన్నావు అమ్మకు
నుసైగతో కాఫీలు కలిపి పెట్టే అన్నపు పళ్ళేలకు
నీ చేతులు అండదండలై అమ్మ చేతలకు ఆదర్భంగా అందరు ఇల్లాళ్ళకూ
నీ అణుకువ – సహనం అనుభూతి అంతులేని అభిమానం
అవధులు లేని ఆధ్యాత్మిక పరిజ్ఞానం – మధుర ప్రణయ బహుమానం
నీ జీవన సర్వస్వాన్నీ అమ్ముకు సమర్పించుకున్నావు. సమర్పించుకున్నావు
అమ్మ సన్నిధే పెన్నిధిగా అరవై యేళ్ళుపైగా ఆనందంగా గడుపుతున్నావు.
అమ్మ పాదపద్మాలపై నిత్యం తులసీదళం వేస్తావు – హృదయ నివేదన కావిస్తావు.
అందరికీ ఆ ప్రసాదం పంచుతున్నావు అమ్మపై నమ్మకం పెంచుతున్నావు
చెలిగా – సహచరిగా సేవకురాలిగా అమ్మకు సహకరిస్తావు:
నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో అమ్మను నింపుకొని అమ్మ తలపులలో జీవిస్తావు
ఎవరి లోపాలెంచకుండా దయతో ప్రేమతో సేవిస్తావు కనుకనే
“దయామణి”గా నీ శ్రీవారు నిన్ను సంభావించారేమో! వసుంధరా!
భాష అనే సూక్తిని మౌక్తికంగా ధరించి – నీ శ్రీవారి చింతనలో పరవశిస్తున్నావు.
అమ్మ మాటే వేదంగా ‘సమర్తబంతిని’- సందెగొబ్బెబ్బను క్షీరాబ్ధిద్వాదశిని నిర్వహిస్తున్నావు
ఇల్లాలిగా అమ్మ దినచర్య “శ్రీవారి చరణసన్నిధి” ఒక దృశ్యకావ్యంగా వ్రాశావు
ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రత్యక్ష సత్యంగా లోకానికి వెల్లడి చేశావు |
“సహజ సహస క్రీ” అయిన శ్రీవారి తలలోని నాల్కగా మెలిగిన నీ వివేకం:
సలుపుతున్నది సోదరీ సోదరులచే “అమ్మగృహిణికి అపరంజి అభిషేకం”