తరగని విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాల నిలయమే గ్రంథాలయము. గ్రంథాలయము అనగానే విజ్ఞానము, మానసిక వికాసము, మానసికోల్లాసము మరియు ప్రశాంతత గుర్తుకు వస్తాయి. కానీ మా కొరకు ఎంతో శ్రమకోర్చి శరశ్చంద్ర అన్నయ్యగారు మరియు ఎందరో మహనీయులు ఏర్పరచిన “అమ్మ గ్రంథాలయము” నకు వచ్చినట్లయితే మనకు కలిగే మానసిక ప్రశాంతతను, అక్కడి వాతావరణమును వర్ణించుటకు మాటలు సరిపోవు. మనసు ప్రశాంతతను పొందుతుంది. అక్కడ ఉండే అన్నయ్యగారిని చూడగానే ఓర్పు సహనం మరియు మంచితనమును నేర్చుకుంటాం. మరి అక్కడ ఉన్న గ్రంథాల వలన జ్ఞానవంతులము అవుతాం. మా కళాశాలలో కూడా గ్రంథాలయం ఉన్నది అక్కడా మాకు కావలసిన గ్రంథాలున్నాయి. అయితే ఇక్కడ ఒక చక్కని క్రమశిక్షణ కనబడుతుంది.
ముఖ్యంగా ఈ గ్రంథాలయము వలన క్రొత్తగా చేరిన విద్యార్థులకు అమ్మ గురించి తెలుసుకొనుటకు కావలసిన గ్రంథాలున్నాయి. ఈ గ్రంథాలయం వలన గ్రంథపఠనం అలవాటు లేని ఎందరికో గ్రంథపఠనం అలవాటైనది. ఈ గ్రంథాలయమును ఏర్పరచుట వలన ముఖ్యంగా ‘అమ్మ’ జీవితచరిత్రను తెలుసుకొనుటకు ఎంతో వీలుగా ఉన్నది. రోజంతా హాస్టల్లో, కళాశాలలో ఎంతో హడావుడిగా, గందరగోళంగా ఉండే మాకు, ఈ గ్రంథాలయమునకు వెళ్లినట్లయితే అక్కడ ఉన్న రెండు గంటల సమయమై ఎంతో ప్రశాంతంగా మా మనసు ఉంటుంది. నచ్చిన గ్రంథంఏదైనా మంచి మిత్రుని తోడు లభించిదనినట్లే ఉంటుంది.
అవకాశము ఉన్నచో మాకొరకు ఈ ఆధునిక కాలంలో అందరికీ ఎంతో ఉపయోగకరమైన పుస్తకం “Computer Basics and how to use Net” కావాలని కోరుకుంటున్నాము. అలాగే చందమామ (Telugu & English), Hindu, Enadu newspaper,, పెద్దబాలశిక్ష, దేవుని పాటలు, శ్లోకాలు గల పుస్తకం, శ్రీరామకృష్ణ మఠం పుస్తకాలు మొదలైనవి కోరుతున్నాము. అలాంటి పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సోదర సోదరీమణులందరూ ఈలాంటి అలవాటు చేసుకోవటం భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తుందని నా విశ్వాసం.