15-8-2012 తేదీన శ్రీ బి. రవీంద్రరావు, పాట్రన్, శ్రీ విశ్వజననీ పరిషత్, జిల్లెళ్ళమూడి, వారిచే ‘అమ్మ గ్రంథాలయం’ ప్రారంభించబడింది. ఆ పఠన మందిరం జిల్లెళ్ళమూడిలో హైమవతీనగర్లో ‘శ్రీ పరాత్పరి’ భవన ప్రాంగణంలో నెలకొల్పబడింది. ఈ సందర్భంగా అందు అమ్మను గురించిన సాహిత్యము – గ్రంథాలు, పత్రికలు, దృశ్యశ్రవణ సామాగ్రి ఉంచబడినవి.
అమ్మ గ్రంథాలయము – రూపకల్పన
– ఎమ్.యస్.శరశ్చంద్రకుమార్
హైదరాబాదులోని బ్రిటిష్ లైబ్రరీ సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పనిచేశాను. గ్రంథాలయము మరియు సమాచారమునకు సంబంధించిన వృత్తిగల వ్యక్తిని. కనుక అమ్మ సంస్థలో మంచి గ్రంథాలయమును నెలకొల్పాలని చాలా కాలంగా అభిలషిస్తున్నాను.
‘అమ్మ గ్రంథాలయము’ అనేది ఒక పఠన మందిరము. అందు అమ్మను గురించిన సాహిత్యము – గ్రంథములు, పత్రికలు, దృశ్యశ్రవణ పరికరములు ఉంటాయి. అది స్థానికులు, యాత్రికులు మరియు కళాశాల విద్యార్థులు… అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ లక్ష్యదిశగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. దీనిని ఉపయో గించుకునే తీరు తెన్నులను అధ్యయనం చేసిన పిమ్మట ముందు ముందు మరిన్ని సేవలూ, సదుపాయాల్ని అందజేస్తాము.
* అమ్మను గురించి నేడు అందుబాటులో ఉన్న గ్రంథాలయ సామాగ్రి:
– అన్ని ‘విశ్వజనని’, ‘Mother of All’ తెలుగు, ఆంగ్ల భాషలలోని గ్రంధాలు, పత్రికలు (కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి అయినది)
– అన్ని ‘మాతృశ్రీ’ మాస పత్రికలు (కంప్యూటరీ కరణ అయినది
– అమ్మ మాటలు, పాటల ఆడియో సి.డి.లు అమ్మ దివ్యసన్నిధిలో రికార్డు చేసినవి, నేటి ప్రధాన పండుగలు, ఉత్సవములకు సంబంధించిన వి.సి.డి.లు వేల సంఖ్యలో అమ్మ, నాన్నగారు, హైమక్కయ్యల ఫోటోలు, ఓవిఓలు (శ్రీ పోట్లూరి వెంకట సుబ్బారావు, చీరాల డాక్టర్, గారి సౌజన్యంతో)
* మాతృశ్రీ డిజిటల్ సెంటర్, జిల్లెళ్ళమూడి. అమ్మకు సంబంధించిన సకల సమాచార ఆధారాలన్నీ భద్రపరుస్తోంది. కంప్యూటర్ పరిజ్ఞానం కల సోదరీ సోదరులు ఎప్పుడైనా, ఎచ్చటనైనా వాటినీ సులభంగా పొందవచ్చు.
* జిల్లెళ్ళమూడిలోని స్థానికులు, అందరింటికి వచ్చి పోయే యాత్రికులు ఎవరైనా, కంప్యూటర్ నైపుణ్యం ఉన్నా లేకపోయినా, అమ్మ గంధాలయంలో కొంత సమయాన్ని వెచ్చించి లబ్ధి పొందగలరు. *
– మాతృశ్రీ డిజిటల్ సెంటర్, జిల్లెళ్ళమూడి కేంద్రం నుంచిసమాచారాన్ని నేరుగా పొందగోరు వారికి ‘అమ్మ గ్రంధాలయం’ ఒక తొలిమెట్టు, ముందడుగుగా ఉపయోగ పడుతుంది.
– అమ్మ గ్రంధాలయం జిల్లెళ్ళమూడిలో హైమవతీ నగర్లో ‘శ్రీ పరాత్పరి’ భవన ప్రాంగణంలో సూత్ర ప్రాయంగా ప్రారంభించబడినది. ఒక పఠనమందిరంగా మలిచి అందు కొన్ని గ్రంధాలు, పత్రికలు…. ఉంచబడ్డాయి.
– గ్రంధాలయం అనుదినం సాయంకాలం గం 4.30. నుండి గం 6.30 ల వరకు తెరచియుండును. ప్రస్తుతము
పార్ట్ టైం సిబ్బందితో నిర్వహించబడుతుంది.
– సి.డి.లు, డి.వి.డి. ల వినియోగమును క్రమేణా అందుబాటులోనికి తీసుకువస్తాము.
– గ్రంధాలయం అందరికి ఉపయుక్తంగా ఉంటే పాఠకుల సౌకర్యార్థం పనివేళల్ని పొడిగిస్తాం.
– ‘అమ్మ గ్రంథాలయము’ ఏడాదికి రు 60,000రూ లు,అంటే నెలకు కేవలము రు 5000లు వ్యయంతో నిర్వహించబడునని ఒక అంచనా.
ఈ నా భగీరథ యత్న సిద్ధికోసం అమ్మను ప్రార్ధిస్తున్నాను. అమ్మ అనుగ్రహ సంపూరితములైన దివ్యా శీస్సులకోసం ఎదురు చూస్తున్నాను.