అన్నము పెట్టు చోటులను, ఆదరణమ్ము నొసంగు చోట, ఆ
పన్నుల నూరడించుచును బాధలు తీర్చెడి చోటులందు, సం
పన్నులు పేదవారనుచు, వర్ణము వర్గమటంచు నెన్నడున్
భిన్నత లేని చోటులను ప్రేమకు పెన్నిధి అమ్మ ఉండెడున్.
అమ్మకు ప్రణమిల్లుతూ
శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి