(గతసంచిక తరువాయి భాగం)
అమ్మ ఎందుకో నన్ను M.A. Eng. చెయ్యమని చెప్తూ ఉండేది. వాసుదేవచారిగారి గైడెన్స్ తీసుకొని చదువు మొదలు పెట్టమంది. మాస్టార్ని కలిసావా, ఏమన్నారు? అని రెండుసార్లు అడిగింది. ఆయన ఊర్లో లేరమ్మా’ అని చెప్పాను. మాస్టారు వచ్చింతర్వాత అడిగాను. అమ్మ మీ guidance తీసుకోమందండి అని. విజయవాడలో Tu-torials చాలా ఉన్నాయి. వాళ్ళకి రాసి కనుక్కోమన్నారు. విశాఖపట్నం వెళ్ళింతర్వాత మా బావగార్ని అడుగుదామను కున్నాను. A.U.లో Chemistry department లో Reader గా work చేస్తున్నారు. అప్పుడు అమ్మ పిలిచి మళ్ళీ అడిగింది. మాస్టార్ని కలిసావా ? ఏమన్నారు అని? . చెప్పాను. అమ్మ ఇంకేమీ అనలేదు.
1983 MA.Eng. కోర్సు చదివే ధైర్యం లేక Po- litical Science కి apply చేసి books అవీ తీసుకొని June school re-opening time కి వచ్చాను. చదువు మొదలు పెట్టావా అని అడిగింది అమ్మ మళ్ళీ. అమ్మకు తెలియందేముంది ? Political Science తీసుకున్నానమ్మా అని నసిగాను.
1983 M.A. మొదటి సంవత్సరం Exam రాయాలి. కనీసం 20 రోజులు శలవు పెట్టాలి అనుకుంటూ అమ్మ దగ్గరకు వెళ్ళాను. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అమ్మ దగ్గర, ఎవరో ఒకరు ఉంటున్నారు. నివేదన చూపించి అమ్మతో మాట్లాడకుండా వచ్చేశాను. ప్రిన్సిపాల్గారు వాసుదేవచారిగారు ఊళ్ళో లేరు. మర్నాడు అమ్మ దగ్గర కెళ్ళినప్పుడు ఆయనక్కడ కూర్చొని కనిపించారు. అమ్మ నన్ను చూడగానే మాస్టారితో “ఇది నా చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది నాన్నా! పరీక్షలు రాయాలి. శలవు పెట్టి వెళ్ళాలి. వెళ్ళమంటావా ?” నేను నోరెత్తకుండానే అమ్మ అడిగేసింది. “అదేంటమ్మా ! తను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు. Exam రాయాలి గదా!’ అన్నారు. ఆశ్చర్యపోవటం, నావంతయింది. మాట వరస క్కూడా అమ్మతో అన్లేదు. ‘ప్రదక్షిణ’ అనే మాట use చేసింది అమ్మ ఇక్కడ.
‘అమ్మ చుట్టూ ప్రదక్షిణ’ చేస్తే అమ్మే చూసుకుంటుంది మనంకేం గావాలో. ఒక రోజు అమ్మ దగ్గరకు మూడుసార్లు వెళ్ళినందుకే నాపని సులభంగా అయిపోయింది.
ఆ తర్వాత మాస్టారు వెళ్ళిం తర్వాత అమ్మ నాతో “సరే ఎప్పుడెల్తావు? ఉండు అంటూ వాళ్ళతో లెక్కవేస్తూ, 13వ తారీకు శనివారం బావుంది. ఆ రోజు బయల్దేరు. పరీక్షలయింతర్వాత వద్దువుగాని’. ఎక్కడికక్కడ అన్నీ ready చేసేసింది అమ్మ. ‘శనివారం సాయంత్రం mail కి వైజాగ్ వెళ్ళాలి. అన్నీ సర్దుకోని అమ్మ దగ్గరకెళ్ళాను చెప్తామని. అక్కడ Chennai Children garden school principal శర్మగారు, వాసుదేవచారిగారు కూర్చుని ఉన్నారు. అమ్మ, శర్మగారి కాళ్ళకు నమస్కారం చేయమంది. ఆయనకు, ప్రక్కన కూర్చున్న వాసుదేవచారిగారికీ నమస్కారం చేసి, అమ్మ చేత బొట్టు పెట్టించుకొని బయల్దేరాను. నేను వెళ్ళటం, exam రాయటం, మళ్ళీ రావటం అన్ని మామూలుగా జరిగిపోయాయి. దానికి పెద్ద importance లేనే లేదు. కానీ నేను రాంగానే అమ్మ అన్న మాటకు పొంగిపోయాను. “అమ్మయ్య ! వచ్చావా! పిల్లలంతా నీకోసం కలవరిస్తున్నారు.” అది చాలు మనకు. ఆ ‘అమ్మ’ మాట చాలు.
(సశేషం)