మాతృశ్రీ అనసూయా దేవి- మన అందరి శతజయంతి ఉత్సవాలు | ఏప్రిల్ 1st 2023న జరగ బోతున్నాయని మనందరికీ విదితమే. అమ్మ లీలలు మహాద్భుతాలు. అమ్మతో 1. అనుభవాలు కోకొల్లలు. ఆ అనుభవాలను ముందు తరాలకి అందించాలన్న తపన అమ్మతో ప్రత్యక్ష అనుభవాలు పొందిన అక్కయ్యలకు అన్నయ్యలకు చాలాకాలంగా మనసులో ఉన్నది. కాని దాన్ని సాకారం చేయడం ఒక్క రావూరి ప్రసాద్ అన్నయ్య గారి ద్వారా అమ్మ చేయించింది. అన్నయ్య దాదాపు 200 లకు పైగా అమ్మ భక్తుల అనుభవాలను వీడియోలలో చిత్రీకరించి, డిజిటల్ పని పూర్తి చేసి భద్రపరిచి youtubeలో అందరికీ అందించడానికి విశేష కృషి చేశారు. అంత బృహత్ కార్యక్రమాన్ని అమ్మ రావూరి ప్రసాద్ అన్నయ్యకు ఆంజనేయునిలాంటి శక్తిని ప్రసాదించింది. లేకపోతే అది సాధ్యమయ్యే పని కాదు. అది అతని జీవిత సాఫల్యం అని మనందరికి అనిపించింది. ఈ సందర్భంగా పి.యస్. ఆర్ ట్రస్టు, విశ్వజననీపరిషత్ వారు కలిసి అద్భుతంగా సత్కరించారు. ఇది రావూరి ప్రసాద్ ద్వారా అమ్మ చేసిన అద్భుత లీల.
శ్రీ లక్కరాజు రామకోటేశ్వరరావు అన్నయ్య గారు ఎంతో కాలంగా అమ్మ సేవచేస్తూ మన విశ్వజననీ పరిషత్ కార్యవర్గంలో ట్రెజరర్ గా సేవలు అందిస్తున్నారు. ఇటీవల వారు హైదరాబాద్ పనిమీద వెళ్ళగా హఠాత్తుగా. ఆరోగ్యం బాగాలేక తక్షణం హాస్పిటల్లో జాయిన్ అమ్మ కావలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ అమ్మ మీద అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి గనుక జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకోనిదే హాస్పిటల్ లో చేరడానికి ఒప్పుకోక జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకున్నీ తర్వాత హాస్పిటల్ లో చూపించుకొని ఎంతో ఆందోళనతో ఉన్న అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆరోగ్యంగా జిల్లెళ్ళమూడి వచ్చి సంస్థలో తనపని తను చక్కగా చేసుకుంటున్నారు. అమ్మకు మ్రొక్కుకుని 1000 టెంకాయలు కొట్టి తన భక్తి ప్రపత్తులను తెలియజేశారు.
మాతృశ్రీ ప్రాచ్య కళాశాల స్థాపించి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా కళాశాల స్వర్ణోత్సవాలను ఘనంగా చేసుకోవడమే గాక అమ్మకోటి నామ స్థూపం కాలేజీ ప్రాంగణంలో నెలకొల్పడం, పూర్వవిద్యార్థి సమితి తరుపున పెద్దలను ఘనంగా సత్కరించడం, ఎన్నో కార్యక్రమాలు అనూహ్యంగా జరపగలగటం అమ్మ మరొక లీల, అంబికా కోటి నామస్తోత్ర పారాయణాలు, జీవిత మహోదధిలో తరంగాలు పారాయణాలు, అక్షర యజ్ఞాలు, లలితాకోటి పారాయణలు, దుర్గాసప్తశతి, మహాసౌరం హోమాలు, సప్తసప్తాహ సామూహిక అమ్మ నామ సంకీర్తనలు, అందరిల్లు Renovation, విద్యార్థినుల హాస్టల్ భవనం, ఇలా ఎన్నో కార్యక్రమాలు అమ్మ. దయవల్లే జరుగుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.