1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ తత్వ చింతన సదస్సు

అమ్మ తత్వ చింతన సదస్సు

P P Bharghava
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : December
Issue Number : 5
Year : 2011

ఇదిగో  ఇది

మాతృశ్రీ తత్వచింతనామృతమౌ ఒక సదస్సు

 మాతృలోక సంచారులు కావించెడి ఒక తపస్సు

 మాతృమహాయజ్ఞమందు సురలు వ్రేల్చు ఒక హవిస్సు 

మాతృమహోదధి మథించపైకి వచ్చు ఒక మహస్సు ॥ఇది॥

 

అమ్మచూపు – అమ్మరూపు – అమ్మమాట – అమ్మ బాట

 అమ్మ నడక – అమ్మ పడక – అమ్మలోని ప్రతి కదలిక

 అమ్మ ప్రేమ – అమ్మకరుణ – అమ్మ మహావాత్సల్యము 

మానవిగా మాధవిగా అమ్మా ధ్యయనముచేసెడి |ఇది||

 

అంతులేక అడ్డులేక అంతటి కాధారమౌచు 

యథార్థమే తనస్థితిగా స్వశక్తితో సాగునట్టి

మరుగు మరుపులేని యట్టి వల్లకాని మిట్టయైన

 ఎరుక గల్గు తల్లి నెరుగ తనయులు కావించుచున్న ॥ఇది

 

శ్రుతులు చదువలేదు కాని స్మృతి సహజముగా నిలచిన

 సర్వసమ్మతమ్మె అయిన మతమే నా మతమని చాటుచు 

అన్ని నేనులందుకూడ తానై నిలచిన తల్లిని

 రాగద్వేషరహితమైన అనసూయను తెలిసికొనగ

 

తరుణము వచ్చినదేమో ? శ్రద్ధాభక్తులను చూచి 

ప్రేరణ తానగుచు మనదు మనసులు మధియించనేర్పి

 తత్వజలధిలోతులలో జ్ఞానరత్నములు చూపుచు 

తనదు అవయవాలమే మనమను అద్వైతస్థితిని నిల్ప | ఇది||

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!